నేడు కనిగిరిలో అమరజీవి జయంతి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:55 PM
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు బుధవారం కనిగిరిలో ఘనంగా జరుగనున్నాయి.

కనిగిరి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు బుధవారం కనిగిరిలో ఘనంగా జరుగనున్నాయి. కందుకూరు రోడ్డులోని ఎంబీఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించే ఉత్సవాల ఏ ర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మంగళవారం పరిశీలిం చా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఉత్సవాల్లో జిల్లాలోని మం త్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.