Share News

గిట్టుబాటు ధరల కోసం పొగాకు రైతుల నిరసన

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:27 AM

ఒం గోలు పొగాకు వేలంకేంద్రం-2లో రైతులు గిట్టు బాటు ధరల కోసం గురువారం వేలం ప్రక్రియ ను నిలుపుదల చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.

 గిట్టుబాటు ధరల కోసం పొగాకు రైతుల నిరసన

నోబిడ్‌లు నివారించాలి

లోగ్రేడ్‌ను కొనుగోలు చేయాలని డిమాండ్‌

ఒంగోలు(రూరల్‌), జూన్‌5(ఆంధ్రజ్యోతి): ఒం గోలు పొగాకు వేలంకేంద్రం-2లో రైతులు గిట్టు బాటు ధరల కోసం గురువారం వేలం ప్రక్రియ ను నిలుపుదల చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు వేలాన్ని నిలుపుదల చేసి తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌-2రకం కూడా అతి తక్కువగా కిలో రూ.220కు కొనుగోలు చేయడం దారుణంగా ఉం దన్నారు. నాణ్యమైన పొగాకును కూడా నోబి డ్‌ చేశారని ఆరోపించారు. లోగ్రేడ్‌లు, మధ్య ర కం బేళ్లును అతి తక్కువ ధరలకు కొనుగోలు చే యటంపై ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు ఆర్‌ ఎం ఎం.లక్ష్మణరావు, వేలంనిర్వహణాదికారి జె. తులసిలను వారు ప్రశ్నించారు. దీంతో వారు స్పందిస్తూ అధిక ధరలకు కొనుగోలు చేయాలని వ్యాపారులతో ఎప్పటికప్పడు సమావేశాలలో చె బుతున్నట్లు చెప్పారు. నోబిడ్‌లు నివారించటాని కి పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాయని తెలిపా రు. వేలం నిర్వహణాధికారి తులసి మాట్లాడు తూ పొగాకు వేలం ప్రక్రియ నిలుపుదల చేయ డం సాధ్యం కాదన్నారు. ఉన్నతాధికారులు ఆదే శాలు ఉంటేనే వేలం నిలుపుదల చేస్తామని తేల్చి చెప్పడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా వేలానికి దేవరంపాడు, బీవీపా లెం, ఉలిచి, పానకాలపాలెం, చేజర్ల, కరవది గ్రా మాల రైతులు బేళ్లు వేలానికి తీసుకువచ్చారు. అనంతరం వేలం తిరిగి ప్రారంభమైంది.

Updated Date - Jun 06 , 2025 | 12:27 AM