Share News

పొగాకు కిలో రూ.321

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:32 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో గరిష్ఠ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అదేసమయంలో నోబిడ్‌లు తగ్గించేందుకు కనిష్ఠ ధరలను కూడా బోర్డు అధికారులు తగ్గించి వేస్తున్నారు. అయినా సగటున నాల్గో వంతు బేళ్లు నోబిడ్‌ అవుతున్నాయి.

పొగాకు కిలో రూ.321

క్రమంగా పెరుగుతున్న గరిష్ఠ ధర

రూ.109కి తగ్గిన కనిష్ఠ ధర

నాల్గో వంతుకు పైగానే నోబిడ్‌లు

ఒంగోలు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో గరిష్ఠ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అదేసమయంలో నోబిడ్‌లు తగ్గించేందుకు కనిష్ఠ ధరలను కూడా బోర్డు అధికారులు తగ్గించి వేస్తున్నారు. అయినా సగటున నాల్గో వంతు బేళ్లు నోబిడ్‌ అవుతున్నాయి. అధికోత్పతి కొనుగోళ్లకు కూడా అనుమతి ఇవ్వడంతో దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలలో మంగళవారం వేలం సాగింది. మొత్తం 11 కేంద్రాలలో 8,963 బేళ్ల అమ్మకాలకు బోర్డు అధికారులు అనుమతించారు. అందులో 5,702ను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. అలా తెచ్చిన బేళ్లలో 3,261 వివిధ రూపాలలో తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో 2,387 నోబిడ్‌ అయ్యాయి. అంటే వేలానికి వచ్చిన వాటిలో నోబిడ్‌లు దాదాపు 26.50శాతం ఉన్నాయి. కనిష్ఠ ధరలను తగ్గించినా అంతస్థాయిలో నోబిడ్‌లు ఉండటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నోబిడ్‌ అయిన వాటిలో 95శాతానికి పైగా లోగ్రేడ్‌ బేళ్లు ఉన్నట్లు సమాచారం. వారంరోజులుగా క్రమంగా గరిష్ఠ ధరలు పెరుగుతున్నాయి. సోమవారం కిలో రూ.317 ఉండగా మంగళవారం మరో రూ.4 పెరిగి రూ.321కి చేరింది.

Updated Date - Sep 10 , 2025 | 01:32 AM