Share News

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేలా..!

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:35 AM

దశాబ్దా ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్లు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గ్రామాలలో ఇనప చువ్వలు కూడా బయటపడి గాలులకు స్తంభాలు విరిగి పడేలా ఉన్నా యి.

విద్యుత్‌ సమస్యలను పరిష్కరించేలా..!

బల్లికురవ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): దశాబ్దా ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్లు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గ్రామాలలో ఇనప చువ్వలు కూడా బయటపడి గాలులకు స్తంభాలు విరిగి పడేలా ఉన్నా యి. దీంతో తరచూ ప్రమాదాలు లో-వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండేది. దీనిపై దృష్టిసారించిన ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం ద్వారా ప్రత్యేక లైన్ల పనులను శరవేగంగా చేయిస్తోంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చొరవతో పలుగ్రామాల్లో జోరుగా పనులు సాగుతున్నాయి.

మండలంలోని గుంటుపల్లి, అంబడిపూడి, వల్లాపల్లి, చెన్నుపల్లి, ముక్తేశ్వరం, సూరేపల్లి, కొణిదెన, నక్క బొక్కలపాడు, బల్లికురవ, మల్లాయపాలెం తదితర గ్రామాలలో రెండు మాసాల నుంచి ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో భాగంగా ప్రత్యేక విద్యుత్‌ లైన్ల పనులు చేపడుతున్నారు. గ్రామాలలో సుమారు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పాత స్తంభాలను తొలగించి బాగా ఎత్తుగా ఉన్న స్తంభాలను ఏర్పాటు చేసి కొత్త వైర్లు కూడా వేస్తున్నారు. దీనికి తోడు గతంలో గ్రామాలలో సింగిల్‌ ఫేస్‌ విద్యుత్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రత్యేక లైన్ల వలన వ్యవసాయానికి ప్రత్యేక లైన్‌తో పాటు గృహాలకు సైతం త్రిఫేస్‌ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన గ్రామాలలో వినియెగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందనుంది. అలానే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మేరకు విద్యుత్‌ స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. లైన్ల ఏర్పాటులో భాగంగా అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలను సైతం తొలగిస్తుండడంతో ముందు మందు విద్యుత్‌ సరఫరాలో లోపాలు కూడా వచ్చే సమస్య ఉండుదు అని అధికారులు అంటున్నారు. గతంలో ఉన్న సింగిల్‌ ఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్లను తీసి వేసి కొత్తగా 100 కేవీ త్రిఫేస్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు అన్ని పూర్తి అయితే గ్రామాలలో విద్యుత్‌ సమస్యలు తొలగి పోతాయని ప్రజలు అంటున్నారు. గ్రామాలలో జరుగుతున్న విద్యుత్‌ లైన్ల పనులను అద్దంకి డీవిజన్‌ ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, మార్టురు ఏడీఈ సురేంద్రబాబు, ఏఈ శ్రీనివాసరావు, గ్రామాల విద్యుత్‌ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. కొన్ని గ్రామాలలో చేపట్టిన పనులు పూర్తి కాగానే మిగిలిన గ్రామాలలో చేయిస్తామని అధికారులు అంటున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:35 AM