వైభవంగా తిరునాళ్ల మహోత్సవం
ABN , Publish Date - May 03 , 2025 | 10:18 PM
రాచర్ల మండలం అచ్చంపేటలో రామయోగి స్వామి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాచర్ల (గిద్దలూరు), మే 3 (ఆంధ్రజ్యోతి): రాచర్ల మండలం అచ్చంపేటలో రామయోగి స్వామి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిశోర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ నిర్వహించిన బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యోగానంద్, టీడీపీ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.