జేఈఈ మెయిన్స్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:36 AM
జిల్లాలో త్వరలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అన్ని కేంద్రాల్లో మార్గదర్శకాలను పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శ
ఎస్పీతో కలిసి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. అన్ని కేంద్రాల్లో మార్గదర్శకాలను పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శనివారం ఆయన ఎస్పీ హర్షవర్థన్‌రాజుతో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల, రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూపు ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, పేస్ ఇంజనీరింగ్ కళాశాల, బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లను పరిశీలించి ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్‌లో జరుగుతున్న టెట్‌ను, డీఆర్‌ఎంఎం స్కూలులో నిర్వహిస్తున్న నవోదయ ప్రవేశ పరీక్షను పరిశీలించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో అన్ని వసతులతోపాటు పరీక్షల నిర్వహణకు సంబంధించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ పరీక్ష జరిగే సమయంలో అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారి వెంట డీఆర్వో ఒబులేశుతోపాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు,