ఎట్ హోంకు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:49 AM
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో ఇచ్చే ఎట్‌హోంకు జిల్లాకు చెందిన ముగ్గురికి అవకాశం దక్కింది. ఆ మేరకు వారికి ఆహ్వానం అందింది.
15న రాజ్‌భవన్‌లో కార్యక్రమానికి ఆహ్వానం
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆధ్వర్యంలో ఇచ్చే ఎట్‌హోంకు జిల్లాకు చెందిన ముగ్గురికి అవకాశం దక్కింది. ఆ మేరకు వారికి ఆహ్వానం అందింది. వీరిలో ఔషధాల తయారీలో విశిష్ట సేవలు అందించిన క్విస్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిషోర్‌బాబు, అదేకళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బి.రేవతి, కొత్తపట్నంకు చెందిన విద్యార్థి ఎన్.రవిశ్రీశంకర్ ఉన్నారు. ఈనెల 15వతేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు.