21న ముగ్గురు మంత్రులు రాక
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:16 AM
కొండపి నియోజకవర్గంలో ఈనెల 21న ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామిలతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
తూర్పునాయుడుపాలెంలో రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
మర్లపాడులో ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాల ఆవిష్కరణ
22న పరిమితంగా ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమం
ఒంగోలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : కొండపి నియోజకవర్గంలో ఈనెల 21న ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామిలతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. వారంతా 21వతేదీ ఉదయం ఒంగోలు చేరుకొని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో కలుస్తారు. అక్కడి నుంచి తొలుత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వెళ్లి సుమారు రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధానంగా విద్యుత్ సబ్ స్టేషన్, తాజాగా నిర్మించిన హైస్కూల్ ప్రహరీగోడ, గ్రామంలో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్లు వంటి వాటిని ప్రారంభిస్తారు. అనంతరం అదే మండలంలోని మర్లపాడులో గ్రామ టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరిస్తారు. నియోజ కవర్గ టీడీపీ శ్రేణులంతా పాల్గొని మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కోరారు. ఇదిలా ఉండగా ఏటా తూర్పునాయుడుపాలెంలో భారీగా నిర్వహించే మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయకులు వర్ధంతి సభను ఈనెల 22న పరిమితంగా నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేకపోవడంతో వర్ధంతి సభను గ్రామస్థులు, దామచర్ల కుటుంబ సన్నిహితులతోనే నిర్వహించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ముందురోజైన ఆదివారం నియోజకవర్గంలో ముగ్గురు మంత్రుల పర్యటనను ఏర్పాటు చేశారు.