Share News

అనుచిత వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:11 PM

మహిళల పట్ల అనుచిత ప్రచారాలు నిర్వహించిన చానల్‌ అధినేత వైఎస్‌ భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి డిమాండ్‌ చేశారు.

అనుచిత వ్యాఖ్యలు చేసినవారిని కఠినంగా శిక్షించాలి
ఎస్‌ఐకు వినతి పత్రం అందచేస్తున్న తెలుగుమహిళా శక్తి నాయకులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ డిమాండ్‌

దర్శి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మహిళల పట్ల అనుచిత ప్రచారాలు నిర్వహించిన చానల్‌ అధినేత వైఎస్‌ భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి డిమాండ్‌ చేశారు. అమరావతి రాజధాని, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ దర్శిలో మంగళవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శి-కురిచేడు రోడ్డులోని ఎన్టీఆర్‌ పల్లెవనం పార్క్‌ నుంచి గడియారస్తంభం సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ఈసందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ మహిళలను కించపర్చే విధంగా మాట్లాడిన సజ్జల

రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళలను గౌరవించని వారిని సమాజం క్షమించదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్‌ లలిత్‌సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి సుబ్బారావు, పుల్లలచెరువు చిన్నా, పి.నెమలయ్య, మోడి ఆంజనేయులు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూరపాటి శ్రీనివాసరావు, మారెళ్ల వెంకటేశ్వర్లు, ఎం.శోభారాణి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

రైతులను పరామర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదు

రైతులను పరామర్శించే నైతికహక్కు జగన్మోహన్‌రెడ్డికి లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ధ్వజమెత్తారు. పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు బుధవారం జగన్మోహన్‌రెడ్డి వస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏ రోజైనా రైతుల సమస్యల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోవటంతో రైతులపై కపట ప్రేమనటిస్తున్నారని విమర్శించారు.

మహిళలను అవమానించడం సిగ్గుచేటు

కనిగిరి : ఓ చానల్‌లో అమరావతి మహిళలను కించపరుస్తూ ప్రసారం చేయడం సిగ్గుచేటని తెలుగు మహిళలు పేర్కొన్నారు. దీనిని నిరసిస్తూ టీడీపీ మహిళాశక్తి ఆధ్వర్యంలో మంగళవారం కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నిండు శాసనసభలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పటికీ మహిళల గుండెల్లో మంటలు రేపుతున్నాయన్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసి వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మహిళల పట్ల కారుకూతలు ప్రసారం

చేస్తున్న మీడియా సంస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నల్లరిబ్బన్లు ధరించి పట్టణంలోని పురవీధుల్లో మహిళలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ల్లో ఎస్‌.శ్రీరాంకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలుగుమహిళలు కరణం అరుణమ్మ, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ వాజిదాబేగం, దొరసాని, పార్వతమ్మ, నారాయణమ్మ, ధనలక్ష్మి, తులసి, నీరజ మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి వారికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:11 PM