ఎరువులు, విత్తనాల కొరత లేకుండాచూడాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:01 AM
రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందిం చాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. శుక్రవారం దర్శిలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అందిం చాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. శుక్రవారం దర్శిలో వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు అవసర మైన పైర్లు సాగు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా అధికారులు అన్నిరకాల సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి సాంకేతికపర మైన సూచనలు అందించాలన్నారు. తక్కువ పెట్టుబ డులతో నాణ్యమైన దిగుబడులు సాధించే విధంగా చైతన్యవంతులను చేయాలని కోరారు. బ్లాక్ మా ర్కెట్‌లో నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిరకాల ఎరువుల కృత్రి మ కొరత సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చె ప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని స్పష్టం చేశారు. చివరి భూములకు కూడా నీరందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌పీ డీఈ పూర్ణచంద్రరావు, ఏడీఏ బాలాజీనాయక్, తది తరులు పాల్గొన్నారు.
నేడు దర్శిలో ట్రాక్టర్ల ర్యాలీ
అన్నదాత సుఖీభవ పథకం అమలుతో రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా శనివారం ఉదయం రైతు రథం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తు న్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ముండ్లమూరు మండ లం పులిపాడు నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ఆరంభమై దర్శి మార్కెట్ యార్డుకు చేరుతుందన్నారు. యార్డులో రైతు సంబర సభ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.