సర్వేలో అలసత్వం లేకుండా చూడాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:19 PM
మంగళవారం సర్వే పురోగతిపై సమీక్షిస్తూ సర్వే పనిలో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్‌లో అధికారులతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
గిద్దలూరు టౌన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మంగళవారం సర్వే పురోగతిపై సమీక్షిస్తూ సర్వే పనిలో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న అన్ని నివాసంలేని పేద కుటుంబాలు తప్పనిసరిగా సర్వేలో చేర్చబడాలని తెలిపారు. సర్వే పనిని ఫీల్డ్ సిబ్బందికి అప్పగించి నవంబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని ఆయన అన్నారు.