సమయం లేదు యంత్రాంగమా..!
ABN , Publish Date - May 02 , 2025 | 11:45 PM
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సాగర్ కాలువలు కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. ప్రస్తుతం అవి పూడిక పేరుకుపోయి చిల్లచెట్లు, ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో సాగర్ కాలువలు కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. ప్రస్తుతం అవి పూడిక పేరుకుపోయి చిల్లచెట్లు, ముళ్ల పొదలతో దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల రైతులే స్వచ్ఛందంగా చిల్లచెట్లను తొలగించుకొని పంటలకు నీరందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టాక కాలువలు మరమ్మతులకు తొలిసారి అవకాశం ఏర్పడింది. అందుకు మే, జూన్ నెలల్లో మాత్రమే. ఆ తరువాత వర్షాలు పడితే కాలువల్లో నీటిని విడుదల చేస్తారు. అప్పుడు కాలువల్లో పూడిక తీయటం, అభివృద్ధి చేయటం సాధ్యమయ్యే పనికాదు. తక్షణమే కాలువలకు మరమ్మతులు చేయాల్సిన అవసరాన్ని అధికార యంత్రాంగం పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. - పర్చూరు