తాళం వేసిన ఇంటిలో చోరీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:38 AM
తాళం వేసిన ఇంట్లో నాలు గు సవర్ల బంగారం చోరీ చే సిన ఘటన టంగుటూరు లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.
టంగుటూరు (కొండపి), జూలై11 (ఆంధ్రజ్యోతి): తాళం వేసిన ఇంట్లో నాలు గు సవర్ల బంగారం చోరీ చే సిన ఘటన టంగుటూరు లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. టంగుటూరులో ని పురంసెంటర్‌లో నివాసం ఉండే బడుగు దీనదాసు త న కుమార్తె నిమ్మకూరు వద్ద స్కూల్‌లో చదువుకుంటుండగా, అక్కడికి తన భా ర్యతో కలిసి బుధవారం వెళ్లాడు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో గమనించిన దొంగలు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని నాలుగు సవర్ల బంగారాన్ని చో రీ చేశారు. దీనదాసు గురువారం రాత్రి ఇంటికి రాగా ఇంటి తాళం పగులగొట్టి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫి ర్యాదు మేరకు క్లూస్ టీం ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించింది.