దేశానికి యువతే వెన్నుముక
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:23 PM
దే శాభివృద్ధికి యువతే వెన్నుముక అని జిల్లా కలెక్టర్ పీ రాజాబాబు చెప్పారు. యువత శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు.
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : దే శాభివృద్ధికి యువతే వెన్నుముక అని జిల్లా కలెక్టర్ పీ రాజాబాబు చెప్పారు. యువత శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ముందుగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ యువత నుంచి నూతన ఆవిష్కరణలు, ఆలోచనల కోసం సమాజం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ నూతన ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీనిద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో నిపుణులైన వారితో యువత అనుసంధానం కావచ్చన్నారు. స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ మాట్లాడుతూ యువజనోత్సవాల్లో ఏడు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను కలెక్టర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
జిల్లా యువజనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు పలునృత్యాల ద్వారా ఆకట్టుకున్నారు.