Share News

మహానాడుకు తరలిన తమ్ముళ్లు

ABN , Publish Date - May 29 , 2025 | 11:15 PM

కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ని యోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పార్టీ తరపున ఏర్పాటు చేసిన సుమారు 50 బస్సుల్లో తరలారు.

మహానాడుకు తరలిన తమ్ముళ్లు
పెద్దారవీడు నుంచి మహానాడుకు వెళ్తున్న టీడీపీ శ్రేణులు

మార్కాపురం, మే 29 (ఆంధ్రజ్యోతి) : కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ని యోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పార్టీ తరపున ఏర్పాటు చేసిన సుమారు 50 బస్సుల్లో తరలారు. మార్కాపురం పట్టణం నుంచి సుమారు 50 కార్లలో కార్యకర్తలు వెళ్లారు. చాలామంది కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా వారే వాహనాలను ఏర్పాటు చేసుకుని వెళ్లడం విశేషం. మార్కాపురం నియోజకవర్గం నుంచి సుమారు 3 వేల మందికిపైగా మహానాడుకు వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గిద్దలూరు టౌన్‌ : కడపలో జరుగుతు న్న మహానాడు కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గం నుంచి 80 ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలతోపాటు 100 కార్లలో ప్రయాణమ య్యా రు. వీరందరికీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మె దుకూరు-పోరుమామిళ్ల మధ్యలో భోజన ఏర్పాట్లు చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న నమ్మకం, నారా లోకే్‌షపై విశ్వాసం ప్రతి ఒక్కరిలో కనిపించిందని, మహానాడుకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

కంభం : కంభం, అర్ధవీడు మండలాల నుంచి కడపలో జరుగుతున్న మహానాడుకు 3వ రోజు వివిధ వాహనాలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివెళ్లారు. మండలాలలోని ప్రతి పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు సొంత వాహనాలలో తరలివెళ్లారు.

కొమరోలు : మహానాడుకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లినట్లు టీడీపీ నాయకుడు ముత్తుముల కృష్ణకిషోర్‌రెడ్డి తెలిపారు. కొమరోలులో బుధవారం మండలంలోని కార్యాకర్తలు, నా యకులు తరలివెళ్లి వాహనాలను ఆయన జెండా జెండాను ఊపి ప్రారంభించారు.

పెద్దారవీడు : తెలుగుతేజం కోసం నిరంతర కృషి చేస్తామని తెలుగుతమ్ములు నినదించారు. కడపలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభలో పాల్గొనేందుకు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. మండలం నుంచి ఆరు బస్సులు, పలు కార్లలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. తెలుగుదేశం విధి, విధానాలను ప్రజలలోకి ప్రతి ఒక్కరూ తీసుకువెళ్లి పార్టీ ఉన్నతికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు పార్టీ నిరంతరం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిశీలకులు గుమ్మా గంగరాజు, పార్టీ నాయకులు ఆనెకాళ్ల శ్రీనివాసులరెడ్డి, గొట్టం శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:15 PM