యువకుడు మృతి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:38 PM
విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకొంది.
డీజే ట్రూఫ్‌లో ఓ శుభకార్యానికి హాజరుకాగా ఘటన
అద్దంకి, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌షాక్‌తో యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి చోటుచేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ముండ్లమూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన గుర్రాల నాగేంద్రబాబు(25) తన తండ్రి కోటేశ్వరరావు, సోదరుడు, మరికొందరు బృందంతో ఆదివారం రాత్రి డీజే సౌండ్స్, బ్యాండ్ మేళం బృందంతో వచ్చాడు. పెండ్లి పూర్తయిన తరువాత వర్షం పడుతుండటంతో డీజే సౌండ్స్ పరికరాలపై పట్ట కప్పారు. భోజనం చేసిన తరువాత బయలుదేరేందుకు సిద్ధమవుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో పట్టతొలగిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే ప్రవేట్ వాహనం లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగేంద్రబాబుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు సోమవారం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు.