Share News

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:06 PM

మహిళల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో 334 మంది అంగన్‌వాడీ కార్యక ర్తలకు, 15 మంది సూపర్‌వైజర్లకు 5జీ ఫోన్‌ లను పంపిణీ చేశారు.

మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న డాక్టర్‌ లక్ష్మి, పాల్గొన్న టీడీపీ నాయకులు, అధికారులు

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మహిళల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యా లయంలో 334 మంది అంగన్‌వాడీ కార్యక ర్తలకు, 15 మంది సూపర్‌వైజర్లకు 5జీ ఫోన్‌ లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ మహిళల అ భ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు గతంలో ఎన్న డూలేనివిధంగా ఎన్నో పథకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సారథ్యంలోనే డ్వాక్రా గ్రూపు లకు ఉచిత గ్యాస్‌ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారుల ఆరోగ్యం పట్ల పూర్తిశ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా మెనూ ప్రకారం అందించాలని స్పష్టం చేశారు. అవకతవకలకు పాల్పడితే ప్రభుత్వం సహించదని చెప్పారు. విధుల నిర్వాహణలో సాంకేతికను పెంపొందించు కునేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం 5జీ సెల్‌ఫోన్‌ సేవలను అందించటం జరిగిందన్నారు. తమ విధు లను చిత్తశుద్ధితో నిర్వహించాలని కోరారు. ఆరోగ్య వంతమైన సమాజం ఏర్పాటుకోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కల్పన, సీడీపీవో ఆర్‌.పరిమళ, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల అ ధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, శ్రీనివాస రావు, వెంకటేశ్వరరెడ్డి, అంగన్‌వా డీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 135 మంది లబ్ధిదారులకు రూ.82,36,297 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేదప్రజలు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు దయార్ధ హృదయంలో ఆర్థిక సహాయం అందిస్తున్నారని చెప్పారు.

Updated Date - Dec 20 , 2025 | 11:06 PM