Share News

పేద ప్రజల సంక్షేమమే టీడీపీ అజెండా

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:08 PM

పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ అజెండా అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

పేద ప్రజల సంక్షేమమే టీడీపీ అజెండా
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు తీసుకున్న లబ్ధిదారులతో ఎమ్మెల్యే కందుల

22 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కందుల

మార్కాపురం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ అజెండా అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 22 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షలకుపైగా మొత్తాన్ని చెక్కుల రూపంలో అందించారు. అనంతరం ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసమే నిత్యం పనిచేస్తోందన్నారు. గత వైసీపీ పాలనలో సీఎం సహాయనిధి అందిన దాఖలాలులేవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎక్కడా కూడా ఆటంకం లేకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ సాయాన్ని అందజేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజల నుంచి అందే దరఖాస్తులకు ప్రాధాన్యతను ఇస్తున్నారని కందుల అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, కాకర్ల శ్రీనివాసులు, పఠాన్‌ హుసేన్‌ఖాన్‌, వేశపోగు జాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:09 PM