Share News

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:22 PM

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల తండ్రి నారాయణరెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి పాల్గన్నారు.

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో నేతలు

నియోజకవర్గంలో 32 మందికి

రూ.21.89లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అందజేత

మార్కాపురం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల తండ్రి నారాయణరెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి పాల్గన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 32 మందికి రూ.21.89 లక్షల మేర మంజూరైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వైద్యం పొందిన పేదలు సకాలంలో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత సమయంలోనే ముఖ్యమంత్రి సహాయనిధి అందుతోందన్నారు. ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, పార్టీ జిల్లా ప్రధాన సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, కార్యదర్శి రంగస్వామి, కౌన్సిలర్లు కొండయ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 10:22 PM