Share News

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Dec 31 , 2025 | 10:55 PM

పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించటమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు.

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ముండ్లమూరులో పింఛన్‌ అందజేస్తున్న ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి

ముండ్లమూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : పేదలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించటమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. ముండ్లమూరులో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్‌లను లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్ళి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్‌ కడియాల లలిత సాగర్‌, దర్శి మునిసిపల్‌ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, నేతలు మేదరమెట్ల వెంకటరావు, సోమేపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ మేదరమెట్ల వీరనారాయణమ్మ, పంచాయతీ కార్యదర్శి పమేశ్వరి, మాజీ సర్పంచ్‌లు పిచ్చిరెడ్డి, చౌదరి, గోపాల్‌రెడ్డి, బ్రహ్మయ్య, గుంటుపల్లి రంగ నాయకులు తదితరులు ఉన్నారు.

వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసిన పాపారావు

దర్శి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): దర్శి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు బుధవారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా ముందురోజే పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణి, సుబ్బారావు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, టీడీపీ నాయకులు శ్రీనాద్‌, దినకర్‌, సత్యం, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 10:55 PM