పేదల సంక్షేమమే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - May 21 , 2025 | 11:57 PM
పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, అందుకోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ వైపాపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
దుష్ట పాలనకు చరమగీతం పాడిన ప్రజలు
మినీ మహానాడులో
టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, మే 21 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, అందుకోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ వైపాపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభకు టీడీపీ యువనాయకుడు వేగినాటి శ్రీను అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం మండల వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ,బీసీ సామాజిక వర్గాలవారికి స్థానిక సంస్థల్లో పదవులు కేటాయించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు పునాది వేస్తే, అనంతరం వచ్చిన జగన్‌రెడ్డి దుష్టపాలన సాగించి రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్నారు. ఆయన అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో మళ్లీ టీడీపీకి పట్టంగట్టారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సత్తా చాటేలా శ్రేణులు శ్రమించాలని గూడూరి పిలుపునిచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సభలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ శ్రీనివా్‌సగౌడ్, టీడీపీ పుల్లలచెరువు, దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం మండలాల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, యేర్వ మల్లికార్జునరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, మేకల వళరాజు, టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు శనగా నారాయణరెడ్డి, గోట్టం శ్రీనివాసరెడ్డి, బీవీ సుబ్బారెడ్డి, మేడికొండ లక్ష్మినారాయణ, తోట మహేష్, పొట్ల గోవింద్, పాలడుగు వెంకటనారాయణ, గుమ్మా గంగరాజు, మోటకట్ల శ్రీనివాసరెడ్డి, జడ్డారవి, జడి లక్ష్ముయ్య, కంచర్ల సత్యనారాయణగౌడ్, ఆళ్ల నాసరరెడ్డి, నలగాటి చిన్న మల్లికార్జుననాయుడు, షేక్ మస్తాన్ వలి, ఎల్ అబ్రహం, ప్రసాద్, జీవయ్య పాల్గొన్నారు.