అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత
ABN , Publish Date - Aug 12 , 2025 | 10:45 PM
అన్నదాతల సంక్షేమం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని, ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం అన్నదాత సుఖీభవ పథకానికి కృతజ్ఞతగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు నుంచి కుమ్మరాంకట్ట వరకు 450 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులతో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పా ల్గొన్నారు.
ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
450 ట్రాక్టర్లతో సుఖీభవకు కృతజ్ఞతా ర్యాలీ
చంద్రబాబు చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
గిద్దలూరు టౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల సంక్షేమం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని, ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం అన్నదాత సుఖీభవ పథకానికి కృతజ్ఞతగా పట్టణంలోని ఒంగోలు రోడ్డు నుంచి కుమ్మరాంకట్ట వరకు 450 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రైతులతో కలిసి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పా ల్గొన్నారు. ఆయన ట్రాక్టర్‌ను నడిపారు. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ విత్తనం కొనుగోలు నుంచి పంట విక్రయం వరకూ రైతులకు అండగా ప్రభుత్వం ఉం టుందని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామన్నారు. అలాగే రైతులకు సబ్సిడీతో యంత్రాలు, పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కనీసం రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ పాలనలో వేలాది మంది రైతు లు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రచార పిచ్చి లో పట్టాదారు పాస్‌పుస్తకాలపై రాజ ముద్రకు బదులు జగన్ తన బొమ్మను వేసుకున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ. 20వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ రిజర్వాయర్లు నీటితో కళకళ లాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మామిడి, మిర్చి, పొగాకు రైతుల కష్టాలను చూసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని, వరదల వ లన నష్టపోయిన రైతులకు రూ.300కోట్ల పంట నష్టం అందించిందని, నీటి ప్రాజెక్టుల పూర్తికి ముఖ్య మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అశోక్‌రెడ్డి వివరించారు. తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబా, బీజేపీ నాయకులు జె.వి.నారాయణ, గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్లు గోడి ఓబులరెడ్డి, తోట మహాలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ వెంకటసుబ్బయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షానేషావలి, రైతు సంఘం అధ్యక్షులు బిజ్జం రవీంద్రరెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు దుత్తా బాలీశ్వయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
చంద్రబాబు ఉండగా.. సేద్యం పండుగ
పెద్ద దోర్నాల : రైతన్నలకు అండగా చంద్రబాబు ఉండగా.. సేద్యం పండుగేనని ఒంగోలు పార్లమెంట్ టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని అయినముక్కుల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.5 వేలు బ్యాంకులో జమ చేసిన క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళా రైతులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మల్లయ్య ఇంటింటికీ వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వి వరించారు. కార్యక్రమంలో కోటిరెడ్డి, బోళ్ల బాలకృష్ణారెడ్డి, దర్శనం బద్రీ, ఎలకపాటి బాబు పాల్గొన్నారు.