Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 25 , 2025 | 10:16 PM

రైతుల సంక్షేమమే ప్ర జా ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని పాత గోళ్లవిడిపి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతన్నా సేవలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బ్రోచర్లను పంపిణీ చేస్తున్న ఎరిక్షన్‌బాబు

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్ర జా ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు అన్నారు. మంగళవారం మండలంలోని పాత గోళ్లవిడిపి గ్రామంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతన్నా సేవలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు గ్రామంలో ఇంటింటికీ తిరి గి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. రాములోరి దేవాలయ అవరణలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రై తుల సమస్యలను సాగు చేసిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఉద్యాన అధికారి పీ ఆదిరెడ్డి, ఎంపీడీవో బీ శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాళ వెంగళరెడ్డి, మ హేష్‌ నాయుడు, ఎంసీహెచ్‌ మంత్రునాయక్‌, సత్యనారాయణ గౌడ్‌, వ్యవసాయా, ఉద్యానవన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

గిద్దలూరు : రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా ఎరువులను వాడుకోవాలని, తద్వారా పెట్టుబడిలో 20శాతం తగ్గించుకోవచ్చని వ్యవసాయాధికారి విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బురుజుపల్లి గ్రామంలో జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి శ్రీనివాసరెడ్డి, వి విధ అనుబంధ శాఖల ఉద్యోగులు పాల్గొ ని వివిధ అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు.

రాచర్ల : రైతుల వ్యవసాయానికి సంబంధించి ఎ లాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం అందిస్తుందని వ్యవసాయ శాఖ అధికారి షేక్‌ మహబూబ్‌బాషా తెలిపారు. మండలంలోని ఆకవీడు గ్రామంలో మంగళవారం ఆయన రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించి రైతులతో మాట్లాడారు. ఉద్యాన, సెరికల్చర్‌, పశుసంవర్థక మార్కెటింగ్‌ డిమాండ్‌ ఆథారిత పంటలకు రైతులకు ఏది అవసరమో వాటి గురించి చర్చించడమే కార్యక్రమం ము ఖ్య ఉద్దేశమన్నారు. చర్చించిన సమాచారాన్ని డిసెంబరు 3న నిర్వహించే యాక్షన్‌ ప్లాన్‌ సమావేశంలో రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిక ద్వారా తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, మీకోసం సిబ్బంది పాల్గొన్నారు.

కొమరోలు : సేంద్రియ ఎరువులను వాడి దిగుబడి పెంచుకోవాలని గిద్దలూరు ఇన్చార్జి ఏడీఏ, ఏవో కే రాజశ్రీ అన్నారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కే శిరీష, వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ సహాయకులు, పశు సంవర్థక శాఖ సహాయకులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్‌ సహాయకులు, విద్యుత్‌ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

కొనకనమిట్ల : రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారని ఏవో ప్రకాశరావు అన్నారు. మండలంలోని 18 సచివాలయాల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం మంగళవారం రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

పొదిలి : మండలంలోని మల్లవరం గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమం లో మంగళవారం దర్శి ఏడీఏ కె.బాలాజీనాయక్‌, ఏవో శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. ఈసందర్భంగా బాలాజీనాయక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన ఐదు విధివిధానాలు నీటి భద్రత, డిమాం డ్‌ ఆథారిత పంటలు, అగ్రిటెక్‌ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి ధనలక్ష్మి, రైతులు, పలువురు వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 10:16 PM