రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:17 PM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూ రైన రూ.28.74 కోట్ల చెక్కును ఎమ్మెల్యే రైతులకు అందజేశారు.
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ పథకం కింద మంజూ రైన రూ.28.74 కోట్ల చెక్కును ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు పీఎం కిసాన్ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రవ్యాప్తం గా సీఎం చంద్రబాబు చేతులమీదుగా రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పీఎం నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన సందేశాన్ని వీడియో ద్వారా రైతులకు ప్రదర్శింపచేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని కాంక్షించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలో రూ.20 వేలు నగదును వారి ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నారు. అందులోభాగంగా కని గిరి నియోజకవర్గంలో 42వేల మంది రైతులకు మేలు చేకూరి, వారి బ్యాంకు ఖాతాల్లో రూ.28.74 కోట్ల నగదు జమ కానున్నాయన్నారు. గత వైసీపి ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 మాత్రమే ఇచ్చారన్నారు. ఎన్నికల కు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తుందన్నారు. కూ టమి ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో రైతులు ఽధైర్యంగా పంటలను సాగు చేసుకుని ఆర్థిక పురోగతి చెందా లన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏడీఏ జైను లాబ్దిన్, ఏవో లు, నాయకులు శ్యామల కాశిరెడ్డి, భేరి పుల్లారెడ్డి, పాలపర్తి వెంకటేశ్వర్లు, నంబుల వెంకటేశ్వర్లు, పువ్వాడి వెంకటేశ్వర్లు, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, సానికొమ్ము తిరు పతిరెడ్డి (ఎస్‌టీఆర్), బొమ్మనబోయిన వెంగయ్య, పి చ్చాల శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.