Share News

సాగర్‌ జలాలు వచ్చేశాయ్‌!

ABN , Publish Date - May 27 , 2025 | 01:25 AM

తాగునీటి కోసం నాగార్జున సాగర్‌ కుడికాల్వ నుంచి విడుదల చేసిన జలాలు సోమవారం ఉదయం జిల్లాకు చేరాయి. త్రిపురాంతకం మండలంలోకి ప్రవేశించాయి.

సాగర్‌ జలాలు వచ్చేశాయ్‌!
త్రిపురాంతకం వద్ద కాలువలో సాగర్‌ జలాల ప్రవాహం

త్రిపురాంతకానికి చేరిక

ఎర్రగొండపాలెం, మే 26 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి కోసం నాగార్జున సాగర్‌ కుడికాల్వ నుంచి విడుదల చేసిన జలాలు సోమవారం ఉదయం జిల్లాకు చేరాయి. త్రిపురాంతకం మండలంలోకి ప్రవేశించాయి. వేసవి కావడంతో గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో విడుదలైన సాగర్‌ జలాలతో తాగునీటి వనరులను నింపనున్నారు. దీంతో నీటి ఇక్కట్ల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.

Updated Date - May 27 , 2025 | 01:25 AM