Share News

స్వాతంత్రోద్యమానికి వందేమాతర గీతం స్ఫూర్తి

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:08 AM

స్వాతంత్య్ర సమర యోధులకు వందేమాతర గీతం స్ఫూర్తి నింపిందని మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే కొండయ్య, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌లు పేర్కొన్నారు.

స్వాతంత్రోద్యమానికి వందేమాతర గీతం స్ఫూర్తి

చీరాల, నవంబరు7 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర సమర యోధులకు వందేమాతర గీతం స్ఫూర్తి నింపిందని మంత్రి కొలుసు పార్ధసారధి, ఎంపీ కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే కొండయ్య, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌లు పేర్కొన్నారు. శుక్రవారం చీరాల్లో నిర్వ హించిన కార్యక్రమంలో వందేమాతర గీతం ఒకటిన్నర శతాబ్దం పూర్తి చేసుకున్న నేపథ్యంలో గీతాన్ని విద్యార్థులతో కలిసి ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ గీతం ఆలపించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వేడుకలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు గీతాన్ని ఆలపించేలా చూడాలన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించే దిశగా కృషి చేయాలన్నారు. గీత రచయత బంకించంద్ర ఛటర్జీ, రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్‌జీ రంగల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్రనాధ్‌, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు, తహసీ ల్దార్‌ గోపీకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

పంగులూరు : 150 వసంతాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం దేశ ఔన్నత్యాన్ని, విశిష్ఠతను చాటిందని కొండమంజులూరు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఐ.అనిత అన్నారు. కొండమంజులూరు ఉన్నత పాఠశాలలో శుక్రవారం 150 వసంతాలు పూర్తయిన వందేమాతర గీతం, 75వసంతాల స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. వందేమా తరం గీతంపై విద్యార్థులకు వ్యాసరచన, స్వాతంత్ర్యో ద్యమం, పాల్గొన్న యోధుల చిత్రాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. వీటి ప్రాధాన్య తను విద్యార్ధులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మండలం లోని నూజెళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశా లలో నిర్వహిచిన వేడుకలో హెచ్‌ఎం జంపని వెంకటేశ్వర్లు (జేవీఆర్‌), ఉపాధ్యాయులు వీరాంజనే యులు, ఏడుకొండలు పాల్గొన్నారు.

పంగులూరు: మన దేశ జాతీయగీతమైన వందే మాతర గీతం 150 ఏళ్లు వసంతాల వేడుక పంగు లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమా తరం గీత రచయిత బంకించంద్రచటర్జీ చిత్ర పటంవద్ద ఎంపీడీవో కె.స్వరూపారాణి నివాళి అర్పిం చారు. కార్యాలయ సిబ్బంది భక్తి భావంతో వందేమాతర గీతం ఆలపించారు. కార్య క్రమంలో డిప్యూటీ ఎంపీడీవో కె.సుమంత్‌, వైద్యాధికారి డాక్టర్‌ శివ చెన్నయ్య, కార్యాలయ పరిపాలనాధికారి టి.రమేష్‌, రిబ్కా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చినగంజాం : మండల పరిధిలోని పలు గ్రామాల్లో వందేమాతరం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్రచటర్జీ రచించిన జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్ల పూర్తి అయిన సందర్భం గా మండల పరిధిలో వేడుకలు నిర్వహించారు. చినగంజాం గ్రామంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నుండి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కడవకుదురు జడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యా లయంలో వందేమాతరం గీత రచయిత బంకీం చంద్రచటర్జీ చిత్రపటానికి అధికారులు, ఉపాధ్యా యులు పూలమాల వేసి నివాళులర్పించి వందేమాతర గీతం ఆలపించారు. కార్యక్రమంలో చినగంజాం గ్రామ సర్పంచ్‌ రాయని ఆత్మారావు, తహసీల్దార్‌ జె.ప్రభాకరరరావు, ఎంపీడీవో కె.ధనలక్ష్మి, మండల సర్వేయర్‌ లోకేష్‌, గ్రామ కార్యదర్శులు కె.అంజయ్య, పి.శ్రీనివాసరావు, ఎం.వెంకటరమణ, కడవకుదురు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కుర్రా రామారావు, ఉపాఽధ్యాయులు, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 01:08 AM