Share News

నిరుద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:52 PM

నిరుద్యోగ యువకులు వచ్చిన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని టీడీపీ నేతలు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్‌), కొండా కృష్ణారె డ్డి, షేక్‌ ఫిరోజ్‌ అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో ఆదివారం జననీ చారిటబుల్‌ ట్రస్టు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు.

నిరుద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేస్తున్న టీడీపీ నేత ఎస్టీఆర్‌

టీడీపీ నేతలు ఎస్టీఆర్‌, కృష్ణారెడ్డి

కనిగిరి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువకులు వచ్చిన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని టీడీపీ నేతలు సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎస్టీఆర్‌), కొండా కృష్ణారె డ్డి, షేక్‌ ఫిరోజ్‌ అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్‌లో ఆదివారం జననీ చారిటబుల్‌ ట్రస్టు, మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ జాబ్‌మేళాలో పాల్గొన్న ప్రముఖ హీరో కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఎస్టీఆర్‌, ఫిరోజ్‌లు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర వివిధ కం పెనీల ప్రతినిధులను కనిగిరికి పిలిపించి ఈ ప్రాంతంవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పి స్తున్నారన్నారు. ఈక్రమంలో ప్రముఖ హీరో కం పెనీ ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు. ఈ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 172 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. వీరిలో 120 మందికి ఉద్యోగాలకు ఎంపికయ్యా రు. కార్యక్రమంలో మ్యాన్‌పవర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి శ్రీని వాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, షేక్‌ జంషీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:52 PM