Share News

పొగాకు రైతుల కన్నెర్ర

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:29 AM

పొగాకు రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరుకు నిరసనగా కొండపిలో కొనుగోళ్లను బహిష్కరించారు. స్థానిక వేలం కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగారు. నెన్నూరుపాడు గ్రామానికి చెందిన రైతులు శనివారం పొగాకు బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. మేలిమి రకాన్ని నాణ్యతను బట్టి కిలో రూ.200పైన కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ధర ఇవ్వకుండా అత్యధిక బేళ్లను వ్యాపారులు నోబిడ్‌ చేశా రు.

పొగాకు రైతుల కన్నెర్ర
కొండపిలో రాస్తారోకో చేస్తున్న పొగాకు రైతులు

వ్యాపారుల తీరుకు నిరసనగా వేలం బహిష్కరణ

కొండపిలో రాస్తారోకో

ధరలు పెంచి నోబిడ్‌లు తగ్గించాలని డిమాండ్‌

కొండపి, మే 31 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరుకు నిరసనగా కొండపిలో కొనుగోళ్లను బహిష్కరించారు. స్థానిక వేలం కేంద్రం వద్ద రాస్తారోకోకు దిగారు. నెన్నూరుపాడు గ్రామానికి చెందిన రైతులు శనివారం పొగాకు బేళ్లను వేలానికి తీసుకువచ్చారు. మేలిమి రకాన్ని నాణ్యతను బట్టి కిలో రూ.200పైన కొనుగోలు చేయాల్సి ఉండగా ఆ ధర ఇవ్వకుండా అత్యధిక బేళ్లను వ్యాపారులు నోబిడ్‌ చేశా రు. అదేసమయంలో లోగ్రేడ్‌ రకానికి కిలోకు రూ.200 ఇచ్చారు. దీంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాణ్యమైన పొగా కును కొనుగోలు చేయకుండా లోగ్రేడ్‌కు అధిక ధరలు ఇవ్వడం ఏమిటని వ్యాపారులను, బోర్డు అధికారులను నిలదీశారు. వేలాన్ని నిలిపివేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వేలం పునఃప్రారంభమైంది. శనివారం వేలం కేంద్రా న్ని రైతుకూలీ సంఘం నాయకులు సందర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సిరిగిరి లలితకుమారి, జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు బెజవాడ శివరామ కృష్ణయ్య, గొల్లపల్లి వెంకటరావు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 01:29 AM