Share News

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:12 PM

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ముత్తుముల భాస్కర్‌రెడ్డి కల్యాణ మండపంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందనీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది.

ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పది
సన్మానగ్రహీతలతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ముత్తుముల భాస్కర్‌రెడ్డి కల్యాణ మండపంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందనీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కొత్తగా ఉపాధ్యాయులుగా నియమితులైన వా రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది, సమాజంలో గుర్తింపు, ఎదుగుదలకు కృషి చే స్తారని కొనియాడారు. అనంతరం ఎమ్మె ల్యే అశోక్‌రెడ్డిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు, కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:12 PM