గడువులోగా సబ్‌స్టేషన్‌ను పూర్తిచేయాలి
ABN , Publish Date - May 08 , 2025 | 10:36 PM
విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని జా యింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకోసం మండలంలోని శివరాంపురం గ్రామశివారున సబ్ స్టేష న్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని గురు వారం ఆయన పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశం
తాళ్లూరు, మే 8(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని జా యింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఇందుకోసం మండలంలోని శివరాంపురం గ్రామశివారున సబ్ స్టేష న్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని గురు వారం ఆయన పరిశీలించారు. తూర్పుగంగవరం- చీ మకుర్తి వెళ్లే మార్గంలో సర్వే నంబర్లు 307/3లో 0.51సెంట్లు, 307/5లో 3.13 ఎకరాలు మొత్తం 5.64 ఎకరాలు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2018లో నిధులు మంజూరయినా నిర్మాణ పనులు చేపట్టలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే నిర్మాణ ప నులు వేగంగా సాగుతున్నాయి. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ త్వరితగ తిన పనులు పూర్తిచేయాలని సూచించారన్నారు. విద్యు త్ అధికారుల పర్యవేక్షణలో ఆగస్టు నెలాఖరులోగా పూ ర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. 132/కేవీ స బ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే మూడు మండలాలకు చెందిన 60 గ్రామాల ప్రజలు, రైతుల విద్యుత్ కష్టాలు తీరుతాయన్నారు. శివరాంపురం గ్రామసర్వే నంబర్‌లో సబ్‌స్టేషన్ నిర్మిస్తూ తూర్పుగంగవరం సబ్‌స్టేషన్‌గా మంజూరు చేయటం పట్ల ఆ గ్రామానికి చెందిన మ న్నం రామకోటయ్య, మారిశెట్టి హనుమంతరావు తదితరులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయమై జేసీ వి ద్యుత్ అధికారులతో మాట్లాడగా గత టీడీపీ ప్రభుత్వం 2018లో తూర్పుగంగవరం వద్ద మంజూరు చేయగా, తదుపరి ప్రభుత్వం శివరాంపురం వద్ద స్థలాన్ని సమీకరించి నిర్మాణం చేపట్టారని తెలిపారు. శివరాంపురం గ్రామస్తుల విన్నపం మేరకు ఆగ్రామపేరును కూడా విద్యుత్ సబ్‌స్టేషన్‌కు పెట్టేలా సంబందిత అధికారులతో మాట్లాౄడతానని జేసీ గ్రామస్థులకు హమీ ఇచ్చారు.
పొరపాట్లు లేకుండా రీసర్వే చేయాలి
బెల్లంకొండవారిపాలెం గ్రామ వద్ద జరుగుతున్న రీసర్వే పనులను జేసీ గోపాలకృష్ణ పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న గ్రామ విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి సరిపోయిందా, లేదా అడిగి తెలుసుకున్నారు. రైతుల సమక్షంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా రీస ర్వే జరపాలన్నారు. ముందుగా ప్రభుత్వభూములను, తదుపరి పట్టా భూములను కొలిచి ఎలాంటి పొరపా ట్లు లేకుండా చూడాలన్నారు. పొరపాట్లు జరిగితే చ ర్యలు తప్పవని హెచ్చరించారు.
తూర్పుగంగవ రం శివారులో మ ల్లికార్జున రైస్ మి ల్లును జేసీ తనిఖీ చేశారు. మిల్లులో ఉన్న బియ్యాన్ని ప రిశీలించారు. అమ్మ కానికి సిద్ధం చేసిన బస్తాలోని బియ్యాన్ని పరిశీలించి, శ్యాంపిల్స్‌ను పరిశీలనకు పంపాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ప్రభుత్వ భూమిలో గుడిసెలను తొలగించాలి
132/33 కేవీ సబ్‌స్టేషన్‌కు పక్కనేఉన్న పశువుల మే త పోరంబోకు భూమిలో సంచారజాతుల వారు తాత్కాలిక పూరిగుడిసెలు వేసుకుని ఆక్రమించుకున్నారని శివరాంపురం గ్రామస్థులు జేసీ గోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. గుడిసెల్లో నివాసం ఉండకుండా ఎక్కడెక్కడో వుంటున్నారని తెలిపారు. దీనివల్ల పశువుల మేతకు ఇ బ్బందిగా ఉందని విన్నవించారు. జేసీ స్పందిస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తక్షణమే ఖాళీ చేయించాలని తహసీల్దార్ సంజీవరావు, వీ ఆర్వో చంద్రశేఖర్‌రావును ఆదేశించారు. ఆస్థలంలోని ఆ క్రమణలను పది రోజుల్లో ఖాళీ చేయించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రా మస్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని జేసీ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.సంజీవరావు, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, విద్యుత్ ఈఈ కృష్ణారెడ్డి, ఏడీఈ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.