Share News

భూములను పరిశీలించిన సబ్‌కలెక్టర్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:17 PM

కొమరోలు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.336-బీ1, 400-1గల ప్రైవేటు భూములను అప్పటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములుగా మార్చడంపై గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

భూములను పరిశీలించిన సబ్‌కలెక్టర్‌
భూములను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ త్రివినాగ్‌

కొమరోలు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి) : కొమరోలు రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం.336-బీ1, 400-1గల ప్రైవేటు భూములను అప్పటి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములుగా మార్చడంపై గ్రామస్థులు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. దీంతో ఆ భూములను మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ మంగళవారం పరిశీలించారు. పదేళ కిందట అప్పటి రెవెన్యూ అధికారులు పొరపాటున కొమరోలు పట్టణంలోని పోస్టాఫీసు, మఠం

బజార్‌, సాకలి బజార్‌ సమీపంలోగల ప్రైవేటు స్థలాలాలను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడంతో ఈ ప్రాంతాల్లోని గృహాలు, స్ధలాల క్రయవిక్రయాలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ విషయాన్ని కొమరోలు గ్రమానికి చెందిన జాలాది రామలింగేశ్వరరావు, పులకుర్తి సుబ్బరాయుడులు కలెక్టర్‌కు విన్న వించుకున్నారు. ఈ మేరకు మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ వెంకటత్రివినాగ్‌ ఆయా స్థలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. మండలంలోని అల్లినగరం రెవెన్యూ ఇలాకాలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని పర్వేనెం. 436లో

13.75ఎకరాల స్థలాన్ని సోలార్‌ పార్కుకు కేటాయించిన భమిని పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్‌ దేవరశెట్టి భాగ్యలక్ష్మి, సర్వేయర్‌ సిలార్‌ సాహెబ్‌, వీఆర్వోలు రమణారావు, పా

Updated Date - Jun 10 , 2025 | 11:17 PM