Share News

వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:38 PM

మండలంలోని పూరిమెట్లలో గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం 9.15 గంటలకు వేద పండితులు, ప్రధానాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.

వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ
పోలేరమ్మకు పూజలు చేస్తున్న డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

పూరిమెట్లలో పోటెత్తిన భక్తులు

ముండ్లమూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పూరిమెట్లలో గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం 9.15 గంటలకు వేద పండితులు, ప్రధానాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయంలో పోలేరమ్మ అమ్మవారు, అంకమ్మ, నాంచారమ్మ దేవతా మూర్తులను ప్రతిష్ఠించారు. పూరిమెట్ల గ్రామంతో పాటు ఉమామహేశ్వర అగ్రహారం, సుంకరవారిపాలెం, మారెళ్ళ, ఈదర, భీమవరం, తమ్మలూరు, పసుపుగల్లు,

పులిపాడు, నూజెండ్లపల్లితో పాటు దర్శి, వినుకొండ, కురిచేడు, త్రిపురాంతకం, ఒం గోలు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, బెంగు ళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు గ్రామంలో ఊరేగింపు నిర్వ హించారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అమ్మవార్లకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ చింతా శ్రీనివాసరెడ్డి, వైస్‌ ఎంపీపీ బంకా నాగిరెడ్డి, సుంకర బ్రహ్మానందరెడ్డి తదితరులు పా ల్గొన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి పోలేరమ్మ, అంకమ్మ, నాంచారమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్‌ కోడెగ మస్తాన్‌రావు, శంకరాపురం సర్పంచ్‌ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శివపార్వతుల విగ్రహాల ప్రతిష్ఠ

దర్శి, జూన్‌ 6(ఆంధ్ర జ్యోతి): మండలంలోని ఎర్రోబనపల్లిలో శివపా ర్వతులు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం వై భవంగా జరిగింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు విగ్రహల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంప్రదా యబద్ధంగా నిర్వహించారు. కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించారు.

Updated Date - Jun 06 , 2025 | 10:38 PM