శ్రీరాములు ప్రాణ త్యాగఫలితమే రాష్ట్రం అవతరణ
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:42 AM
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సవీ స్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్‌రీడింగ్ రూము వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయకుమార్‌లతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఒంగోలు కలెక్టరేట్,డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎ్‌సవీ స్వామి అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీవీఎన్‌రీడింగ్ రూము వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయకుమార్‌లతో కలిసి మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు అమరణ నిరాహారదీక్ష చేశారన్నారు. శ్రీరాములు దీక్ష చేసి మరణించిన పది రోజుల తర్వాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభుత్వం ప్రకటిచిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గత ఏడాది అధికారికంగా ప్రకటించిందన్నారు. అమరావ తి రాజధానిలో 55 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్వామి తెలిపారు. కలెక్టర్ పీ రాజాబాబు మాట్లాడుతూ ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒడా చైర్మన్ షేక్ రియాజ్, జాయిట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల అధికారులు లక్ష్మానాయక్, శ్రీమన్నారాయన, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు తదితరులు ఉన్నారు.
నివాళులు ఆర్పించిన జేసీ
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక మీకోసం హాలులో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ నేతృత్వంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలను జేసీ కొనియాడారు. ఈకార్యక్రమంలో డీఆర్వో చిన ఒబులేశు, ఎస్‌డీసీలు శ్రీధర్‌రెడ్డి, కుమార్,జాన్సన్, మాధురి, విజయజ్యోతి, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.