మెగా డీఎస్పీ నియామకాలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Aug 13 , 2025 | 02:39 AM
జిల్లాలో మెగా డీఎస్సీ-2025 నియామకాలకు రంగం సిద్ధమైంది. మెగా డీఎస్సీ ఫలితాలను, అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను స్కోర్ కార్డుల రూపంలో పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. వీటిని అభ్యర్థులు డీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్కోర్ కార్డుల రూపంలో అభ్యర్థుల మార్కుల వివరాలు
అభ్యంతరాలు తెలిపేందుకు నేడు తుది గడువు
ఒంగోలు విద్య, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మెగా డీఎస్సీ-2025 నియామకాలకు రంగం సిద్ధమైంది. మెగా డీఎస్సీ ఫలితాలను, అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను స్కోర్ కార్డుల రూపంలో పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. వీటిని అభ్యర్థులు డీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జిల్లాలో డీఎస్సీకి 629 పోస్టులు ప్రకటించగా 21,559 మంది దరఖాస్తు చేశారు. వీరికి జూన్ 6నుంచి జూలై 2 వరకు 26 రోజులపాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించారు. పరీక్షకు హాజరైన అందరి అభ్యర్థుల తుది మార్కులను ప్రస్తుతం విడుదల చేశారు. వీటిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు బుధవారం వరకు గడువు ఇచ్చారు. అలా వచ్చిన వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. అనంతరం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో డీఎస్సీ పోస్టుల భర్తీకి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రతి 50 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రకారం జిల్లాలో 629 మందికి 13 బృందా లను నియమిస్తారు. ప్రతి టీంలో ఒక ఎంఈవో, ఒక హెచ్‌ఎం, ఒక డిప్యూటీ తహసీల్దార్ (రెవెన్యూ) ఉంటారు. ఒక పోస్టుకు ఒక ఖాళీని మాత్రమే చూపించనున్నారు.