Share News

ముంచుకొస్తున్న ‘మొంథా’

ABN , Publish Date - Oct 26 , 2025 | 11:24 PM

జిల్లాకు మొంథా తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. దీనిప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈమేరకు విపత్తుల నివారణ శాఖ నుంచి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్త మైంది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి మున్సిపల్‌ కమిషనర్‌ వై.మహేశ్వరరావు సూచించారు.

ముంచుకొస్తున్న ‘మొంథా’
దర్శిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వరరావు

దర్శి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మొంథా తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. దీనిప్రభావంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈమేరకు విపత్తుల నివారణ శాఖ నుంచి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్త మైంది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దర్శి మున్సిపల్‌ కమిషనర్‌ వై.మహేశ్వరరావు సూచించారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం మండల స్థాయి అధికారులతో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని, ఏవైనా ఇబ్బందులు వస్తే కంట్రోల్‌ రూమ్‌ నంబరు 9553832347కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్నిముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి గాయత్రీదేవి, ఎంపీడీవో బి.కల్పన, డిప్యూటీ ఎంపీడీవో ఆవుల సుధాకర్‌, ఎంఈవో కె.రషురామయ్య, తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు చర్యలు చేపట్టాలి

పీసీపల్లి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తుఫా న్‌ నేపథ్యంలో ఎటువంటి అత్యవసర పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉం డాలని మండల ప్రత్యేక అధికారి పి.భాస్కర్‌బాబు ఆదే శించారు. ఆదివారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫా న్‌ ప్రభావంతో 27,28,29 తేదీలలో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిం చిన నేపథ్యంలో గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పాలేరు నది సమీపంలోని లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాల న్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్‌, రవాణా, వైద్య, పశువైద్య శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో తహసీల్దా ర్‌ సీహెచ్‌ ఉష, ఎంపీడీవో జీవీ కృష్ణారావు, డిప్యూటీ తహసీల్దార్‌ ధర్మతేజ, డిప్యూటీ ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, పశువైద్యాధికారి ఆవులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంత రం ప్రత్యేకాధికారి భాస్కర్‌బాబు విఠలాపురం చెరువును పరిశీలించారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థి తులు ఎదురైనా కంట్రోల్‌ రూం హెల్ప్‌లైన్‌ నెం బరు 8019738536కు ప్రజలు సమాచారం అందించా లని తహసీల్దార్‌ ఉష కోరారు.

వెలిగండ్ల: తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని తహసీల్దార్‌ ఎన్‌.వాసు అన్నారు. ఆదివా రం వెలిగండ్లలో జరిగిన మండలస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీ ల్దార్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశామని, అత్యవసరమైతే 92810 34473 నెంబరును సంప్ర దించాలన్నారు.

ముండ్లమూరు: ముంతా తుఫాన్‌ వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల స్థాయి అధికారులు ప్రజలను అప్రమత్తంచేసి అందుబాటులో ఉండాలని మండల ప్రత్యేకాధికారి సీహెచ్‌ శ్రీనివాసు లు అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు. మండలంలో వాగులు పొంగి ప్రవహించే అవ కాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండా లన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎంశ్రీదేవి, తహ సీల్దార్‌ ఎల్‌.లక్ష్మీ నారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఆర్‌. జనార్దన్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

తాళ్లూరు: మెంఽథా తుపాన్‌తో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి ఏ.కుమార్‌ అన్నారు. ఆదివారం తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు చెరువులు నిండి కట్టలు దెబ్బతినే వీలున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం తాళ్లూరు- విఠలాపురం మార్గంలో గల దోర్నపువాగు చప్టాను, చెరువులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీవీ రమణారావు, ఎంపీడీవో పి.అజిత, ఎంఈవో సుబ్బయ్య, ఎస్‌ఐ ఎస్‌.మల్లికార్జునరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

దొనకొండ: తుఫాన్‌ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని మండల ప్రత్యేకాధికారి పి.మదన్‌ మోహన్‌ ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నష్టం కలుగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వసంతరావునాయక్‌, తహసీల్దార్‌ రమాదేవి, విద్యుత్‌ ఏఈ నాగూర్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

సముద్ర స్నానాలకు వెళ్లొద్దు!

పామూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వాతావర ణం శాఖ జారీ చేసిన మొంథా తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కార్తీక సోమవారంన సముద్ర స్నానాలకు వెళ్లవద్దని సీఐ ఎం.భీమానాయక్‌ విజ్ఞప్తి చేసారు. సీఎ స్‌పురం మండలంలోని భైరవకోనలోని జలపాతం వద్ద స్నానాలు ఆచరించడానికి వచ్చే పర్యాటకులు తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రావద్దన్నారు. వాటర్‌ పాల్స్‌ వ ద్ద నీటి ఉధృతి తీవ్రంగా ఉండటమే కాకుండా భైరవకో నకు వచ్చే దారిలో చప్టా వద్ద వరద నీరు అధికంగా ప్రవహిస్తుందని చెప్పారు.

2

టీడీపీలో క్రమశిక్షణతో మెలగాలి

8 ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

8 వైసీపీ సర్పంచ్‌తో సహా

20 కుటుంబాలు పార్టీలో చేరిక

(26కెఎన్‌జి1) సర్పంచ్‌ దుంపా సంపూర్ణతోపాటు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన చింతగుంపల్లి గ్రామస్థులు

కనిగిరి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీలో క్రమ శిక్షణతో మెలుగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం చింతగుంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్‌ దుంపా సంపూర్ణ 20 కుటుంబాలతో కలసి మండలపార్టీ అధ్యక్షుడు వే మూరి రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చే రారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒ క్కరూ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. టీడీ పీలో ఉన్న నాయకులు వైసీపీని వీడి వచ్చినవారిని కలుపునకుపోయి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. టీడీపీలో చేరిన సర్పంచ్‌ దుంపా సం పూర్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారన్నారు. కనిగిరి ప్రాం తాభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్టు చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో చింతగుం పల్లి గ్రామంలో తెలుగుదేశం విజయకేతం ఎగురవే స్తుందన్నారు. కార్యక్రమంలో చింతగుంపల్లి నాయకులు మల్లికార్జునరెడ్డి, ఉండేల పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొ న్నారు.

3

సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి వెంకట సత్యనారాయణ

మొంథాపై అప్రమత్తం

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సోమవారం నుండి ముంతా తుఫాన్‌ ప్రభావం ఉండబోతుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ఆదివారం ఎంపీడీవో, పోలీసుశాఖ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే సగిలేరువాగు, కంభం మండలంలో గుండ్లకమ్మ వాగులు ప్రవహిస్తున్నాయని, వాటి ప్రవాహంలో ఉదృతిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. తాను ఇప్పటికే తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించానని, పలు మండలాల్లో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఎవరైనా పాత భవనాలలో నివాసం ఉన్న వారిని సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించాలన్నారు. గ్రామస్థాయిలో ముంతా తుఫాన్‌ ప్రభావంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు సమస్యత ఏర్పడితే తక్షణమే సిబ్బందికి గానీ, తనకు గాని ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలిపారు.

ముంతా తుఫాన్‌ ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం తహసీల్దార్‌ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్‌, పోలీసు, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, అగ్నిమాపకం, విద్యుత్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ముందస్తు చర్యలు

మార్కాపురం : జిల్లాపై ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రభావం చూపనున్న మొంథా తుఫాన్‌ను ఎదుర్కొంనేందుకు అవసరమైన అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి, పీఎ్‌సవీపీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎమ్‌.వెంకటసత్యనారాయణ సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆదివారం పట్టణ, మండల పరిధిలోని కీలకమైన శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ ప్రభావంతో అధిక వర్షాలు కురిసే అవకాశాలు మొండుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తి, పశు నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది, మండల అధికారులు వారికి కేటాయించిన కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. చప్టాలు, వాగులు, నదుల వద్ద సిబ్బందిని ఉంచాలన్నారు. కంట్రోల్‌ రూం ఇప్పటికే ఏర్పాటైనందున ఎలాంటి చిన్నపాటి విపత్తు సంభవించినా వెంటనే అప్రమత్తం కావాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ బీవీఎ్‌స.నారాయణరావు, తహసీల్దార్‌ కె.చిరంజీవి, పంచాయతీరాజ్‌ ఏఈ మోహన్‌రాజా, విద్యుత్‌ ఏఈ యశోద, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 11:24 PM