Share News

శాలివాహనులు ఐక్యంగా ఉండాలి

ABN , Publish Date - Oct 19 , 2025 | 10:30 PM

శాలివాహనులు ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి పథంలో పయనించాలని కుమ్మరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.ఈశ్వర్‌ అన్నారు. దర్శిలో ఆదివారం జరిగిన నియోజకవర్గస్థాయి శాలివాహనుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

శాలివాహనులు ఐక్యంగా ఉండాలి
శాలివాహనుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న కుమ్మరి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈశ్వర్‌

కుమ్మరి కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈశ్వర్‌

దర్శి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : శాలివాహనులు ఐక్యంగా ముందుకు సాగి అభివృద్ధి పథంలో పయనించాలని కుమ్మరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పి.ఈశ్వర్‌ అన్నారు. దర్శిలో ఆదివారం జరిగిన నియోజకవర్గస్థాయి శాలివాహనుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. శాలివాహనుల అభివృద్ధికి శక్తివంచలేకుండా కృషి చేస్తానన్నారు. దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల శ్రీనివాసులు రాష్ట్ర కుమ్మర కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆనందదాయకమన్నారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు కె.నాగేశ్వరరావు, పి.శ్రీనివాసులు, అమరసింహం, శాలివాహన సంఘ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 10:30 PM