డీజేఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:34 PM
డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయం అని, పేదలకోసం అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పార్టీ కార్యాలయంలో డీజేఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లుపంపిణీ చేశారు.
- హోం మంత్రి అనిత
దివ్యాంగులకు ట్రై సైకిళ్లుపంపిణీ
ఒంగోలు కార్పొరేషన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయం అని, పేదలకోసం అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ట్రస్ట్ సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పార్టీ కార్యాలయంలో డీజేఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లుపంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ ప్రతినిధులు దామచర్లనాగసత్యలత, దామచర్ల అనీషా లక్ష్మి అధ్యక్షత వహించగా, హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాకు తెలుగుదేశం పార్టీ కంచుకోటలాంటిదన్నారు. గత వైసీపీ హాయాంలోనూ నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచిన ఘనత ఉందన్నారు. ముఖ్యంగా అందరు పెద్దాయనగా పిలుచుకునే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొండమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆయన మంచి పేరు సంపాదించారన్నారు. ఆయన బాటలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సారథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన డీజేఆర్ ట్రస్ట్ సేవలు నిరుపేదలకు మరింత ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. ట్రస్ట్ ద్వారా ఉచితంగా వీధి వ్యాపారులకు గొడుగులు, తోపుడు బండ్లు, అలాగే ఉచిత విద్యను అందించడం, వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం ప్రశంసనీయం అన్నారు. అదేవిధంగా రూ.10లక్షల విలువైన ట్రై సైకిళ్లు ఉచితంగా అందించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ప్రతినిధులు దామచర్ల నాగసత్యలత, దామచర్ల అనీషా లక్ష్మి మాట్లాడుతూ డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమాజ సేవలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలోని స్వర్గీయ ఎన్టీరామారావు, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముత్తమల అశోక్ రెడ్డి, ఎంఎం కొండయ్య, మారిటైం బోర్డు చైౖర్మన్ దామచర్ల సత్య, దర్శి, వై.పాలెం ఇన్‌చార్జులు గొట్టిపాటి లక్ష్మి, గూడూరి ఎరిక్షన్ బాబు, మేయర్ గంగాడ సుజాత, ఒడా ఛైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, జనసేన నాయకులు కంది రవిశంకర్‌తోపాటు, రోటరీ క్లబ్ అధ్యక్షులు రావిపాటి శ్రీనివాసరావు, సెక్రటరీ కల్లూరి శ్రీనివాస్, కోశాధికారి ఆర్ల శ్రీరామమూర్తి, పలువురు పాల్గొన్నారు.