పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:55 PM
పోలీ సు అమరవీరుల త్యాగాలు మరువలేనివని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సీఐ వై.రా మారావు అన్నారు. వారి సేవలను నిరం తరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు.
దర్శి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీ సు అమరవీరుల త్యాగాలు మరువలేనివని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సీఐ వై.రా మారావు అన్నారు. వారి సేవలను నిరం తరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. దర్శిలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారస్తంభం సెంటర్‌లో వి ద్యార్థులు మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయటమే కాక శాంతి భద్రతల పరిరక్షణలో అనేకమంది అమరులైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ ఎం.మురళీ, పలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పామూరులో..
పామూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పోలీసుల త్యాగాలను మరువలేమని సీఐ ఎం.భీమానాయక్ పే ర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మర ణ దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ ని ర్వహించారు. ఈసందర్భంగా సీఐ మా ట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మర ణ దినం జరుగుతుందని తె లిపారు. కార్యక్రమంలో పా మూరు, సీఎస్‌పురం, వెలిగండ్ల ఎస్‌ఐలు కిశోర్‌బాబు, వెంకటేశ్వర నాయక్, కృష్ణపావని, పోలీసులతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అక్షర కళా శాల అధ్యాపకులు, విద్యార్థులు పా ల్గొన్నారు.
ప్రజారక్షణే పోలీసులు ధ్యేయం
కనిగిరి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సమాజ పరి రక్షణ, ప్రజారక్షణే ధ్యేయంగా ప్రతి పోలీసు తమ కర్త వ్యాలను నిర్వహిస్తారని సీఐ షేక్ ఖాజావలి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్యవం సంద ర్భంగా మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు నివాళులర్పించి వందనం చేశారు. ఈ సందర్బంగా సీఐ ఖాజావలి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విధి నిర్వహణలో భాగంగా కొన్ని సంధర్భాల్లో పో లీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రాణాలు పోయే సమయంలో కూడా ప్రజారక్షణ కోసం ఆలోచించేది పోలీసులేనని అన్నారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రజలు అండగా నిలవా లన్నారు. దేశరక్షణలో జవాను, సమాజంలోని ప్రజల రక్షణ కోసం పోలీసులు అనునిత్యం కృషి చేస్తారన్నారు. విపత్కర పరిస్థితిల్లో ప్రజలకు ప్రాణనష్టం వాటిల్లే సందర్భంలో తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రక్షణ కవచంలా పోలీసులు మారతారన్నారు. తొలుత స్థానిక పోలీసు స్టేషన్ నుంచి పట్టణంలోని పురవీ ధుల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్ చేస్తూ ప్రజలకు పోలీసు అమరవీరుల త్యాగాలపై అవగాహన కల్పించారు. అ నంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి ప్రజల సమక్షంలో పోలీసు అమరవీరులకుు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో కని గిరి సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు టి.శ్రీరాం, మాధవ రావు, కోటయ్య, ఏఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
3
పోలీసు అమరవీరులకు నివాళి
సేవలు మరువలేనివి
ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజా రక్షణ కోసం అసువులుబాసిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా పట్టణంలో మంగళవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ ప్రారంభించారు. ర్యాలీ పోలీసు స్టేషన్ వద్ద ప్రారంభమై దోర్నాల బస్టాండ్, నాయుడువీధి, రథం బజార్, మెయిన్ బజార్ మీదుగా గడియారస్థంభం వరకు చేరుకుంది. ఈ సందర్భం గా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. నిరంతరం ప్రజల సంరక్షణ కోసం వారు పాటుపడుతుంటారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు, సీఐ పి.సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, అంకమ్మరావు, అహరోన్, ఏఎంసీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర నాయకుడు డాక్టర్ షేక్ మౌళాలి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ షెక్షావలి, కనిగిరి రమణ, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు పాల్గొన్నారు.
గిద్దలూరు టౌన్ : అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించాలని గిద్దలూరు అర్బన్, రూరల్ సీఐలు కె.సురేష్, రామకోటయ్య అన్నారు. పోలీసు స్టేషన్ నుంచి కుమ్మరాంకట్ట, రైల్వేస్టేషన్, రాచర్లగేటు వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
త్రిపురాంతకం : అమరులైన పోలీసులకు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ అస్సాన్‌తో కురిచేడు, దొనకొండ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దారవీడు : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్సై సాం బశివయ్య అన్నారు. పోలీ్‌సస్టేషన్ నుంచి దేవరాజుగట్టు వరకూ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్ అనిల్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పుల్లలచెరువు : శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన పోలీసులకు పోలీసులు ఘనంగా నివాళులర్పించారు. ఎస్‌ఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సంస్మరణ స భ అనంతరం బస్టాండ్ సెంటరులో మా నవహారం నిర్వహించారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కంభం : శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా పలువురు పోలీసుల త్యాగాలు మరువలేనివని సీఐ మల్లికార్జున తెలిపారు. కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండ లాల ఎస్సైలు నరసింహారావు, రవీంద్రారెడ్డి, శివనాంచారయ్య, పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసులతోపాటు తహసీల్దార్ కిరణ్, ఎంపీడీవో వీరభద్రాచారి పాల్గొన్నారు.
కొమరోలు : పోలీసు అమర వీరుల త్యాగాలు మురవలేమని ఎస్‌ఐ నాగరాజు అన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులతో కలిసి పోలీసు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ఎర్రగొండపాలెం : పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్‌ఐ పీ చౌడయ్య అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎస్‌ఐ చౌడయ్య, పోలీసులు విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు.
పెద్ద దోర్నాల : పోలీస్ అమర వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎస్సై వీ మహేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో కలిసి పోలీసులు నటరాజ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవ హారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బం ది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.