Share News

నేరాల నియంత్రణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - May 21 , 2025 | 11:10 PM

నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ దామోదర్‌ చెప్పారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో బుధవారం జిల్లాస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నేరాల నియంత్రణే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి
మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్‌

జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌

కనిగిరి, మే 21 (ఆంధ్రజ్యోతి) : నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ దామోదర్‌ చెప్పారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో బుధవారం జిల్లాస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సర్కిల్‌, పీఎ్‌సల పరిఽధిలో విధిగా ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వివరాలను గోప్యంగా విచారించి వాటికి అడ్డుకట్టు వేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో నిఘా మరింత పెంచాలన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అల్లర్లు జరిగే సమయంలో తప్పనిసరిగా డ్రోన్‌ కెమారాలను వినియోగించాలని చెప్పారు. పట్టణ కేంద్రాల్లో ప్రధాన రోడ్డు వెంబడి ఉండే వ్యాపారసంస్థలు, షాపులు యజమానులకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. దొంగతనాలు రద్దీ ఏరియాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, జనసంచారం లేని ప్రాంతాలు, తోటలు, కొండ దిగువ ప్రాంతాల్లో గస్తీ చేపట్టాలన్నారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలని చెప్పారు.సమావేశంలో ఏఎ్‌సపీ కే నాగేశ్వరరావు, కనిగిరి, మార్కాపురం, దర్శి డీఎ్‌సపీలు సాయిఈశ్వర్‌యశ్వంత్‌, యూ నాగరాజు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సమావేశ అనంతంరం ఎస్‌పీ ఆదేశాలతో జిల్లాలోని పలు సీఐలు, ఎస్‌ఐలు కనిగిరి నగర నలుమూలల నాకాబందీ నిర్వహించారు. గార్లపేటరోడ్డులో ఒంగోలు దిశ సీఐ సుధాకర్‌ వాహనాల తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా ఒంగోలు సీసీఎస్‌ బాబురావు ఒంగోలు బస్టాండు సెంటరులో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వాహన రిజిస్ర్టేషన్‌ పత్రాలు లేని వాహనాలను పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Updated Date - May 21 , 2025 | 11:10 PM