Share News

ఇచ్చిన వాగ్దానాలకు తిలోదకాలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:50 PM

ఎన్నికలకు ముందుదు ఇచ్చిన వాగ్దానా ల ను అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ.ప్రసాద్‌ ఆరోపించారు.

 ఇచ్చిన వాగ్దానాలకు తిలోదకాలు

విద్యుత్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

26న నిరసన ప్రదర్శనలు

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 6 (ఆంధ్ర జ్యోతి): ఎన్నికలకు ముందుదు ఇచ్చిన వాగ్దానా ల ను అమలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ.ప్రసాద్‌ ఆరోపించారు. ఒంగోలులోని నాగిరెడ్డిభవన్‌లో గురువారం జ రిగిన సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ సమి తి సమావేశానికి జిల్లా కన్వీనర్‌ చుండూరి రం గారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎన్నిక ల ముందు స్వామినాథన్‌ సిఫార్సులను అమ లు చేస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చే స్తామంటూ హామీలు ఇచ్చి ఇప్పడు తిలోకదకా లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే కిసాన్‌ సంవాద్‌ నిధిని రూ.12వేలకు పెంచాల ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేవలం 37 కరువు మండలాలను మాత్రమే ప్ర కటించిందన్నారు. తుఫాన్‌తో కురిసిన వర్షాలతో కరువు మండలాలు తగ్గుతాయా అని ఆయన ప్రశ్నించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. క న్వీనర్‌ రంగారావు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చి న హామీ మేరకు పంటల మద్దతు ధర చట్టం చేయలేదన్నారు. 2025 విద్యుత్‌ సవరణ చట్టా న్ని ఉపసంహరించుకోవడంతో పాటు 10 గంట ల పనివిధానం జీవోను రద్దు చేయాలన్నారు. ఈనెల 26న జరిగే నిరసన ప్రదర్శనలను విజ యవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రెట్టింపు ఆదా యం దేశీయ రైతుకు ఎక్కడా రావడం లేదన్నా రు. జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో బర్లీ పొగాకు కొనుగోలు కు నిధులు కేటాయించినా కొనుగోళ్ళు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే పొగాకు కొనుగో లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు సాగర్‌, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌.లలితకుమారి, ఏఐటీయూసీ జి ల్లా ప్రధానకార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖరఖ్‌, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి వి. బాలకోటయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు, చెరుకూరి వాసు, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 11:50 PM