Share News

టోల్‌ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - May 14 , 2025 | 12:18 AM

టంగుటూరు టోల్‌ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట టోల్‌ప్లాజా కార్మికులు చేసిన ధర్నాకు తిరుమలరావు అధ్యక్షత వహిం చారు.

టోల్‌ ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

ఒంగోలు కలెక్టరేట్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : టంగుటూరు టోల్‌ప్లాజా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట టోల్‌ప్లాజా కార్మికులు చేసిన ధర్నాకు తిరుమలరావు అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లా డుతూ కార్మికులకు గ్రాడ్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌ మెంట్‌, నేషనల్‌ హాలిడేస్‌, పెయిడ్‌ హాలిడేస్‌, పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యానికి అనేక సార్లు వినతపత్రాలు ఇచ్చి చర్చలు జరిపినా ఇంతవర కు సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికుల స మస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తోం దని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షుడు టంగు టూరు రాము మాట్లాడుతూ కార్మికుల సమస్య ల పరిష్కారాంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. సమస్య లు పరిష్కారం కానందునే ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారు లు జోక్యం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.కాశీవిశ్వనాఽథ్‌, శృతి, మహేష్‌, నరేంద్ర, కోటేశ్వరరావు, మోజస్‌, రాజశే ఖర్‌ పాల్గొన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - May 14 , 2025 | 12:18 AM