Share News

అర్జీలు రీఓపెన్‌కాకుండా పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:05 AM

అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అర్జీ రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను కలెక్టర్‌ జారీచేశారు.

అర్జీలు  రీఓపెన్‌కాకుండా పరిష్కారం చూపాలి
మీకోసంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అర్జీ రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను విన్నవించారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలను కలెక్టర్‌ జారీచేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాకుండా వారి సమస్యను సావధానంగా విని నిబంధనల మేరకు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత పరిష్కార విధానం, దరఖాస్తుదారులు సంతృప్తి చెందారా, లేదా అన్న విషయాన్ని అధికారులు స్వయంగా ఫోన్‌ చేసి తెలుసుకోవాలన్నారు. అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి ఖచ్చితంగా సంబంధిత జిల్లా శాఖల అధికారులు రావాలని, ఏదైనా కారణాల వల్ల రాలేని పక్షంలో ముందస్తు అనుమతి తీసుకొని సెకండ్‌ లెవల్‌ అధికారిని పంపించాలని సూచించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేశు, డిప్యూటీ కలెక్టర్లు కుమార్‌, జాన్సన్‌, విజయజ్యోతితో పాటు పలుశాఖల అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:05 AM