రాజీమార్గమే రాజమార్గం
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:48 PM
రాజీమార్గం రాజమార్గమని మార్కాపురం 6వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.శుభవాణి అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ముందుగా కక్షిదారులకు జరిగిన అవాగాహన కార్యక్రమంలో న్యాయాధికారి శుభవాణి మాట్లాడుతూ చిన్నపాటి విషయాలకే కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దన్నారు. రాజీమార్గం ద్వారా కోర్టు, కక్షిదారుల సమయం ఆదా అవుతుందన్నారు.
లోక్‌అదాలత్‌లో 2వేల కేసుల పరిష్కారం
మార్కాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాజీమార్గం రాజమార్గమని మార్కాపురం 6వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.శుభవాణి అన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ముందుగా కక్షిదారులకు జరిగిన అవాగాహన కార్యక్రమంలో న్యాయాధికారి శుభవాణి మాట్లాడుతూ చిన్నపాటి విషయాలకే కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోవద్దన్నారు. రాజీమార్గం ద్వారా కోర్టు, కక్షిదారుల సమయం ఆదా అవుతుందన్నారు. గ్రామ స్థాయిలోనే చిన్నపాటి సమస్యలను పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. ఈ సందర్భంగా నాలుగు బెంచిల ద్వారా నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 2 వేల కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో పెట్టీ కేసులు 1,800, ఎక్సైజ్ కేసులు 60, క్రిమినల్ కేసులు 40, చెక్ బౌన్స్ కేసులు 15, వివాహ సంబంద కేసులు 2, భరణం కేసులు 6, సివిల్ కేసులు 19, ఎంవీ యాక్ట్ కేసులు 9 పరిష్కారాయమయ్యాయి. బెంచిల్లో న్యాయాధికారులు బి.దేవేందర్‌రెడ్డి, జె.కిషోర్‌కుమార్, ఎమ్.బాలాజీలు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. ఎనిమిది మంది న్యాయవాదులు బెంచి మెంబర్లుగా వ్యవహరించారు.
మొండి కేసుల పరిష్కారం
జూనియర్ సివిల్ న్యాయాధికారి ఓంకార్
గిద్దలూరు టౌన్ : రాజీమార్గం ద్వారా మొండి కేసులను పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఏ ఓంకార్ అన్నారు. శనివారం గిద్దలూరు కోర్టు సముదాయంలో జరిగిన లోక్‌అదాలత్‌లో మొత్తం వెయ్యి కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో ఎస్‌టీసీ కేసులు 747, ఎక్సైజ్ కేసులు 110, బీఎన్‌ఎ్‌స 125, సివిల్ కేసులు 22, బీఎ్‌సఎన్‌ఎల్ 6 కేసులు పరిష్కారమయ్యాయి. 1000 కేసులకు గాను రూ.48,43,771 కక్షిదారులకు అందించారు. ఇందుకు న్యాయవాదులు జి.ఆనంద్‌కుమార్, ఎం.పిచ్చయ్య, గిద్దలూరు అర్బన్ సీఐ కె.సురేష్, అర్థవీడు ఎస్సై శివనాంచారయ్య, ఎక్సైజ్, బీఎ్‌సఎన్‌ఎల్ అధికారులు పా ల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో బాల్య వివాహాలను అరికట్టడంపై న్యాయాధికారి ఓంకార్ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అన్నారు. బాల్యవివాహం నేరమని, ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే దగ్గరలోని అంగన్‌వాడీ సెంటర్‌కు గానీ, పోలీసుస్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేయాలన్నారు. కా ర్యక్రమంలో బార్ అసోసియేషనన్ అధ్యక్షులు పాలుగుళ్ల నాగశేషశైనారెడ్డి, ఉపాధ్యక్షులు బి.ప్రకాశ్, ప్యా నల్ న్యాయవాదులు, జూనియర్, సివిల్ న్యాయవాదులు, పారాలీగల్ అద్దంకి మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
1191 కేసులు పరిష్కారం
పొదిలి : లోక్ అదాలత్‌లో భాగంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్‌లో పలు రకాల కేసులను న్యాయాధికారి, లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ప్రత్యూష పరిశీలించారు. వాటిలో 177 ఐపీసీ కేసులు, ఎన్‌ఐయాక్ట్ 3, సివిల్‌మనీ 5, ఈపీ-1, మెయింటైన్స్ 3, డీవీసీ 1, ఎస్‌టీసీ 1001 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమె తెలిపారు. మొత్తం 1191 కేసులు పరిష్కారమయ్యాయని అందకుగాను రూ. 30లక్షల 60వేల నష్టపరిహారం కక్షిదారులకు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.