గుండ్లకమ్మ నదిలో దూకిన వృద్ధుడు
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:55 PM
గుండ్లకమ్మ నదిలో దూకి వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన పట్టణంలోని భాగ్యనగర్ 2వ లైనులో చోటుచేసుకొంది.
అద్దంకి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి) : గుండ్లకమ్మ నదిలో దూకి వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన పట్టణంలోని భాగ్యనగర్ 2వ లైనులో చోటుచేసుకొంది. కాలనీకి చెందిన మాచాబత్తిన నా గబ్రహ్మాచారి(63) మానసిక, శారీరక అ నారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గురువారం మెడికల్ షాపుకు వెళ్లి మందులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. నేరుగా, గుండ్లకమ్మ నది వద్దకు వెళ్లి దుస్తులు విప్పి నదిలో దూకినట్లు భావిస్తున్నరు. వాహనచోదకులు ఈ విషయాన్ని గమనించి స్థానికులకు చెప్పారు. నాగబ్రహ్మాచారి ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులు వెతకడం ప్రారంభించారు. పోలీసులకు విష యం తెలియడంతో సీఐ సుబ్బరాజు ఘ టనా స్థలానికి వెళ్లి విచారించారు. వంతెనపై ఉన్న చెప్పులు ఆధారంగా నాగబ్రహ్మాచారిగా కుటుంబసభ్యులు గుర్తించా రు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.