Share News

కాల్వ పోరంబోకు ఆక్రమణ

ABN , Publish Date - Jul 16 , 2025 | 10:34 PM

కంభం చెరువు ఆయకట్టు కింద పంట పొలాల కాలువ గట్లపై నడుచుకుంటూ రైతులు వ్యవసాయం సాగిస్తూంటారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగకతప్పదు. ఎందుకంటే రైతులను ఇతరులను వెళ్లనీయకుండా రోడ్డుకు కంచె వేశారు.

కాల్వ పోరంబోకు ఆక్రమణ
కాల్వను ధ్వంసం చేసి అడ్డంగా పాతన కర్రలు

రైతులకు ఇక్కట్లు

చోద్యం చూస్తున్న అధికారులు

తహసీల్దార్‌కు బాధితుల ఫిర్యాదు

బేస్తవారపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : కంభం చెరువు ఆయకట్టు కింద పంట పొలాల కాలువ గట్లపై నడుచుకుంటూ రైతులు వ్యవసాయం సాగిస్తూంటారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగకతప్పదు. ఎందుకంటే రైతులను ఇతరులను వెళ్లనీయకుండా రోడ్డుకు కంచె వేశారు. బేస్తవారపేట మండలం నేకునాంబాద్‌ పంచాయతీ చింతలపాలెం రెవెన్యూ ఇలాకాలోని కంభం చెరువు కట్ట కింద సర్వే నెంబర్‌ 302లో ప్రభుత్వ కాల్వ పోరంబోకు స్థలంగా రికార్డులో నమోదై ఉంది. ఈ కాల్వ గట్టు స్థలం నుంచే వెనుక వైపు గల రైతులు ట్రాక్టర్లు, ఇతర రాకపోకలు సాగిస్తున్నారు. అంతేగాక ఈ కాల్వ గట్టు నుంచి వెళ్తేనే వెనుక ఉన్న శ్మశానానికి చేరేది. ఈ కాల్వ గట్టు స్థలం తనదంటూ ఒకరు ఏకంగా ఎక్స్‌కవేటర్‌తో చదును చేసి ప్రధాన రోడ్డు వద్ద కర్రలతో అడ్డుకట్టు వేశారు. దీంతో రైతులు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక సర్వే నెంబర్‌ 38-1బీలో 38 సెంట్ల శ్మశాన స్థలానికి కేటాయించగా సాదుమావీధి, సత్యమ్మ గుడి వధిలోని ప్రజలు ఇక్కడ అంత్యక్రియలు చేస్తుంటారు. ఇప్పుడు దారిలేకపోవడంతో వెళ్లలేక పోతున్నారు. ఈ కాలువ నుంచి కంభం చెరువు నీరు కొంత ఆయకట్టుకు పారుతుంది. కాలువ పూడ్చివేయడంతో మరి కొందరు రైతులు ఆందోళన పడుతున్నారు. తప్పని పరిస్థితిలో వెనుక వైపు గల రైతులు కొందరు ఈస్థలంలో నుంచి వారి పొలాలకు వెళ్తుంటే కంచె వేసిన వక్తులు అడ్డగిస్తున్నారు. దీంతో బుదవారం ఆ ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని లేదంటే మా భూములు బీడు భూములుగా మారుతాయనిచ శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలు ఏలా చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్‌ జితేంద్రకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jul 16 , 2025 | 10:34 PM