రెల్లి ఉపకులాలుగా బేడజంగాలను చేర్చడం అభినందనీయం
ABN , Publish Date - Mar 18 , 2025 | 10:44 PM
బేడజంగం ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెల్లి ఉపకులాలుగా బేడజంగాలను చేర్చుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం అభినందనీమని బేడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు చెప్పారు.
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : బేడజంగం ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రెల్లి ఉపకులాలుగా బేడజంగాలను చేర్చుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం అభినందనీమని బేడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు చెప్పారు. స్థానిక ఎంసీఏ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బేడజంగాన్ని ఉపకులాల్లో చేర్చేందుకు ఈనెల 20న నేషనల్ ఎస్సీ కమిషన్‌కు పంపుతామని చెప్పడం హర్షణీయమన్నారు. కొన్నేళ్లుగా బేడజంగంలో చదువుకున్న విద్యార్థులకు కుల సర్టిఫికెట్లు లేక ప్రభుత్వం ద్వారా వచ్చే అనేక పథకాలను విద్యార్థులు అందుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రంగరాజ మిశ్రా కమిషన్ ఎదుట కూడా తమ సమస్యలు విన్నవించుకోవాలన్నారు. వర్గీకరణలో ఎస్సీ ఏలో చేర్చడం బేడసంఘానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎనగంటి నాగేశ్వరరావు, మరిపూడి భద్రయ్య, ఈయనగంటి ఆనందరావు, నాటకం శంకరరావు, తోట మల్లికార్జునరావు, కాకుమాను రవి, పగడల చిరంజీవి, బి. కిరణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.