భారత సైనికుల వీరోచిత పోరాటం మరువలేనిది
ABN , Publish Date - May 17 , 2025 | 10:59 PM
భారత సైనికుల వీరోచిత పోరాటం మరువలేనిదని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై భారత సైనికులు నిర్వహించిన సిందూర ఆపరేషన్ విజయవంత మైన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా దర్శిలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మే 17(ఆంధ్రజ్యోతి): భారత సైనికుల వీరోచిత పోరాటం మరువలేనిదని టీడీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై భారత సైనికులు నిర్వహించిన సిందూర ఆపరేషన్ విజయవంత మైన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా దర్శిలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు దేశభక్తి ని చాటుతూ వంద అడుగుల పొడవుగల జాతీ య జెండాను ర్యాలీలో ప్రదర్శించారు. ఈసందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ శత్రుదేశాల ఎ త్తులను చిత్తు చేయడంలో భారతదేశం ఘన విజయం సాధించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న సాహసోపే త నిర్ణయాలతో శత్రుదేశం ఘోర ఓటమి చవిచూసిం దన్నారు. మన సైనికులు చూపుతున్న సాహసానికి అందరం మద్దతు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవ ణ్‌కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో, కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే కార్యక్ర మాలు అమలు చేస్తున్నాయన్నారు. దేశరక్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నా యన్నారు. ప్రజలందరూ ప్రభుత్వా లు తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉం దన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తహసీల్దార్ ఎం.శ్రావణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వై.మహేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, పుల్లలచెరువు చిన్నా, నారపుశెట్టి మధు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చి త్తశుద్ధితో కృషి చేస్తుందని టీడీపీ నియో జకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందుఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల్లో భా గంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల తరుపున కూట మి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పా రు. రైతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ భవ నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీవర్గాల ప్రజల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.