జొన్నతాళి వద్ద అండర్‌పాస్ ఎత్తు పెంచాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:38 PM
జాతీయరహదారిపై మం డల పరిధిలో జొన్నతాళి రోడ్డు వద్ద నిర్మాణం జరుపుకుంటున్న అండర్‌పాస్ ఎత్తును పెంచాలని నేషనల్ హైవే పీడీ అనిల్ కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫోన్‌లో పలు సూచనలు చేశారు. ఈ మేరకు బుధవారం నేషనల్ హైవే పీడీకి ఎమ్మెల్యే ఏలూరి ఆదేశాలకు అనుగుణంగా ఒక వినతిపత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు.
వినతిపత్రం అందజేసిన టీడీపీ నాయకులు
మార్టూరు, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి):జాతీయరహదారిపై మం డల పరిధిలో జొన్నతాళి రోడ్డు వద్ద నిర్మాణం జరుపుకుంటున్న అండర్‌పాస్ ఎత్తును పెంచాలని నేషనల్ హైవే పీడీ అనిల్ కుమార్‌రెడ్డికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫోన్‌లో పలు సూచనలు చేశారు. ఈ మేరకు బుధవారం నేషనల్ హైవే పీడీకి ఎమ్మెల్యే ఏలూరి ఆదేశాలకు అనుగుణంగా ఒక వినతిపత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు. ప్రస్తుతం జొన్నతాళి రోడ్డు వద్ద టెండరు ప్రకారం ప్రతిపాదించిన 4.5 మీటర్లు ఎత్తులో అండర్‌పాస్ నిర్మాణం జరుగుతున్నది. దానిని 5.5 మీటర్లు ఎత్తు వరకు పెంచాలని ఎమ్మెల్యే ఏలూరి హైవేపీడీకి సూచించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మార్టూరు ప్రాంతంలో గ్రానైట్, కంకర, గ్రావెల్, పతి తదితరాలను రవాణా చేసే లారీలు, బస్సుల కోసం తప్పని సరిగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అండర్‌పాస్ ఎత్తు పెంచాలని ఏలూరి హైవే అధికారిని కోరారు. హైవేవే పీడీకి ఎమ్మెల్యే ఏలూరి పంపించిన వినతిపత్రాన్ని అందజేసిన టీడీపీ నాయకులు కామేపల్లి హరిబాబు, శ్రీకాంత్,షేక్ రజాక్,,కామినేని జనార్దన్, తొండెపు ఆదినారాయణ, పెంట్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.