మొక్కజొన్న రైతులను వెంటాడుతున్న కష్టాలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:56 AM
వాతావరణ పరిస్ధితులు అనుకూలించక, గిట్టబాటు ధరలు లేక కష్టాల్లో ఉన్న రైతు లను అడుగడుగున సమస్యలు వెంటాడుతు న్నాయి.
పర్చూరు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వాతావరణ పరిస్ధితులు అనుకూలించక, గిట్టబాటు ధరలు లేక కష్టాల్లో ఉన్న రైతు లను అడుగడుగున సమస్యలు వెంటాడుతు న్నాయి. మొంథా తుఫాను ప్రభావంతో రబీలో సాగు తలపెట్టిన మొక్కజొన్న సకాలంలో విత్తలేక పోయారు. గత్యంతరం లేక కాస్త ఆలస్యమైనా సాగుచేపట్టిన రైతులకు ప్రారంభ దశలోనే క్రిమి కీటకాల బెడద వెంటాడుతుంది. గతంలో మొక్కజొన్న సాగులో పంట చేతికి వచ్చే నాటికి రెండు నుంచి మూడుసార్లు క్రిమి సంహారక మందు లు పిచికారి చేస్తే సరిపోయేది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సాగు ప్రారంభం మొక్క దశలోనే మూడు నుండి నాలుగు సార్లు మందులు చల్లాల్సి వస్తోందని దీంతో పెట్టుబడి బారం పెరిగిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కొన్ని చోట్ల కత్తెర పురగు కూడా కనిపిస్తుండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రస్తుతం అధికశాతం మచ్చల పురుగు(లద్దెపురుగు) పైర్లను కనిపిస్తుందని, దీన్ని నియంత్రించ లేక నానా అవస్ఝఽలు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. కత్తెర పురుగు సోకితే ఏమిచేయాలో అర్ధంకాక రైతులు ఒకింత కలవరానికి గుర వుతున్నారు. పర్చూరు వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో ఈఏడాధి ఖరీఫ్ సాగు నామమాత్రంగానే సాగు అయ్యింది. అధిక శాతం రైతుల రభీ సాగువైపే ఆశలు పెట్టుకున్నారు. అయితే వాతావరణ పరిస్థితులతో పాటు గత ఏడాధి వేల ఎకరాల్లో సాగుచేసుకున్న నల్లబర్లీ పొగాకు కొంత మేర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినా అధిక భాగం రైతుల వద్దే నిల్వ ఉంది. దీంతో పాటు, గత మూడేళ్లగా సరైన ధరలేక శనగ కోల్డ్ స్టోరేజ్‌ల్లోనే నిల్వలు ఉన్నాయి. దీనికి తోడు రబీలో అధికశాతం రైతులు నల్లబర్లీ పొగాకును సాగుచేయాల్సి ఉన్నా, ఈ ఏడాది ప్రభుత్వం నల్లబర్లీ సాగును నిషేధించింది. దీంతో ఏపంటలు సాగుచేయాలో అర్ధంకాక రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచనలు ఇచ్చిన నేపధ్యంతో పాటు మొక్కజొన్నకు కొంత మేర ప్రభుత్వ గిట్టుబాటు ఽధర వస్తుందన్న ఆశతో రైతులు సాగువైపు మొగ్గు చూపారు. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. ఇలాంటి తరుణంలో చీడ పీడలు, వాతావరణ పరిస్థితులు మొక్కజొన్న సాగుకు ఏ మేరకు అనుకూలిస్తాయో వేచిచూడాల్సి ఉంది.