Share News

గ్రానైట్‌ పరిశ్రమను సంక్షోభం నుంచి కాపాడాలి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:09 AM

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమను కాపాడాలని గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్‌ నాయకులు కోరారు. మైన్స్‌ డీడీ రాజశేఖర్‌ని సోమవారం కలిసిన నాయకులు సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

గ్రానైట్‌ పరిశ్రమను సంక్షోభం నుంచి  కాపాడాలి
మైన్స్‌ డీడీ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఓనర్ల అసోసియేషన్‌ నాయకులు

చీమకుర్తి,అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమను కాపాడాలని గ్రానైట్‌ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్‌ నాయకులు కోరారు. మైన్స్‌ డీడీ రాజశేఖర్‌ని సోమవారం కలిసిన నాయకులు సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈనెల 1నుంచి నిరవధిక సమ్మెలో ఉన్న గ్రానైట్‌ యజమానులు డీడీ రాశేఖర్‌ను కలిసి ఇచ్చిన వినతిపత్రంలో వివరాలు ఇలా ఉన్నాయి.

శ్లాబ్‌ విధానంలో భాగంగా కట్టర్‌కు రూ.35వేలు, అదనంగా జీఎ్‌సటీ చెల్లిస్తున్న నేపథ్యంలో రాళ్ల కొలతలతో సంబంధం లేకుండా పర్మిట్లు మంజూరు చేయాలని కోరారు.

అక్టోబర్‌ 1నుంచి శ్లాబ్‌సిస్టంలో చెల్లించే రాయల్టీని కట్టర్‌కు రూ.35 వేలకు పెంచగా మరో రెండు సంవత్సరాలు పెంపును అమలు చేయకుండా పాతపద్ధతి ప్రకారమే రూ.27వేలు చెల్లించేవిధంగా సవరణ ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు.

మైనింగ్‌ సిస్టంలో ఒక క్యూబిక్‌మీటర్‌కు 500 చదరపు అడుగులు రికవరీగా నిర్ధారణ చేయాలని కోరారు.

సీనరేజి వసూలు హక్కులు కైవసం చేసుకున్న ఏఎంఆర్‌ సంస్థ కట్టర్‌కు ప్రభుత్వం నిర్ధేశించిన రేటు కన్నా అదనంగా రూ.30వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారని, ఇలా చేస్తే ఫ్యాక్టరీలు నడిపే పరిస్థితి ఉండదన్నారు.

రాయల్టీ చెల్లించినందుకు తమకు కేటాయించిన 22 మీటర్లను 90 రోజుల పాటు వినియోగించుకొనే అవకాశం ఇవ్వాలి.

ముడిరాళ్లను కొనుగోలు చేసే సమయంలో కొలతల వ్యత్యాసాన్ని 20 శాతం వరకూ అనుమతించాలి.

సీనరేజి హక్కులు పొందిన సంస్థతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలి

సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకొని పరిశ్రమను ఆదుకొనే చర్యలు చేపట్టాలి. ఈ వినతిపత్రం అందజేసినవారిలో అసోసియేషన్‌ నాయకులు కాట్రగడ్డ రమణయ్య. యర్రగుంట్ల శ్రీనివాసరావు, లగడపాటి శ్రీనివాసరావు, మలినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:09 AM